Amruta-fadnavis: మాజీ సీఎం భార్య చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్లు..

Amruta-fadnavis: టెక్నాలజీ వాడకంతో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా సెలెబ్రిటీలయ్యారు. సోషల్ మీడియాతో ఎప్పటికప్పుడు తమ పర్సనల్ అప్డేట్స్, ఫోటోల్ని కూడా షేర్ చేస్తున్నారు. తమ అభిమానులతో పలు రకాల విశేషాలను షేర్ చేసుకోవడం తప్పు కాదు. కానీ దానికి కూడా కాస్త లిమిట్ అనేది ఉండాలి.

amruta-fadnavis-song-viral1
amruta-fadnavis-song-viral1

ఈ క్రమంలో రిసీవ్ చేసుకునే నెటిజన్లు.. మంచి చేస్తే ఎలా ప్రశంసిస్తారో.. వెర్రీగా బిహేవ్ చేస్తే.. అదే స్థాయిలో రెస్పాండ్ అవుతారు. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేటెస్ట్ గా అలాంటి ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్యపై నెటిజన్లు మండిపడుతున్నారు.

తీవ్రమైన కామెంట్స్ తో విమర్శిస్తున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా తన సోషల్ మీడియా అకౌంట్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలో ఓ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది.

ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన మణికే మాగే హితే సాంగ్ ని మార్పులు చేసి ఆమె స్వయంగా ఆడి పాడారు. ఈ పాటను ఆమె హిందీలో హమ్ చేశారు. దీనికోసం టైట్ రెడ్ కలర్ ఫ్యాంట్ తో పాటు టీ షర్ట్, దాని మీద వైట్ టీ షర్ట్ ని వేసుకున్నారు.

amruta-fadnavis-song-viral
amruta-fadnavis-song-viral

ఈ పాటకు ఆమె వాయిస్ తో పాటు హావభావాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఓ మాజీ ముఖ్యమంత్రి భార్య అంటే ఎలా ఉండాలి.. మరి ఇంత అతిగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదంటు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.