Amou Haji : కొన్ని దశాబ్ధాలుగా స్నానం చేయకుండా.! అయినా ఆరోగ్యంగానే.!

NQ Staff - October 26, 2022 / 05:29 PM IST

Amou Haji : కొన్ని దశాబ్ధాలుగా స్నానం చేయకుండా.! అయినా ఆరోగ్యంగానే.!

Amou Haji : ఒక్క రోజు స్నానం చేయకపోతేనే ఒళ్లంతా కంపు కొట్టేస్తుంటుంది. స్నానం చేయకపోతే, తిన్నది ఒంట పట్టదురా.. అని మన పెద్దోళ్లు తిట్టి పోస్తుంటారు. అలాంటిది కొన్ని దశాబ్ధాల పాటు స్నానం చేయకుండా వుంటే.. ఎలా వుంటుంది.

తూచ్.! అలాంటి వాళ్లు అసలుంటారా.? అంటారా.? వున్నారండీ. ఆయనే అమౌ హజీ. వయసు 94 ఏళ్లు. ఈయనకు సబ్బు, నీళ్లు అంటే మహా చిరాకట. వాటితో స్నానం చేయడం ఇంకా అసహ్యమట. ఇరాన్‌లోని డెగాహ్ గ్రామ శివారులో ఎలాంటి సౌకర్యాలు లేని ఓ పాత పూరి గుడిసెలో ఈయన నివాసముంటారు.

60 ఏళ్ల తర్వాత ఒకే ఒక్కసారి స్నానం.!

కొందరు గ్రామస్థుల ప్రోద్భలంతో 60 ఏళ్ల తర్వాత ఒకే ఒక్కసారి ఈయన స్నానం చేశారట. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ముళ్ల పంది మాంసాన్ని వండకుండానే తినేస్తుంటాడట అమౌ. మురికి గుంటల్లోని నీటిని తుప్పు పట్టిన డబ్బాల్లో పట్టుకుని తాగేవారట.

కుళ్లిపోయి ఎండిపోయిన పశువుల పేడని ఓ పాత పైపులో వేసుకుని ధూమపానం చేసేవారట. ఒకేసారి నాలుగైదు సిగరెట్ల కాల్చేయడమంటే మహా సరదా అట మనోడికి. ఇన్ని దురలవాట్లున్న అమౌ హజీ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా వుండేవారట.

గ్రామస్థులు ఓ సారి స్నానం చేయించడానికి వాహనంలో తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, బండిలోంచి దూకేశారట. ఆ తర్వాత అలాంటి సాహసం చేయలేదట. అన్ని దశాబ్ధాల పాటు స్నానం చేయకుండా వున్న ఆయన్ని శాస్త్రవేత్తలు పరీక్షించగా ఎలాంటి బాక్టీరియా, పరాన్న జీవుల కారణంగా బాధపడింది లేదని తేల్చారు.

అందుకే ఆయన్ని ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా పిలుస్తారు. విషాదమేంటంటే, ఇటీవల స్వల్పంగా జబ్బు పడిన అమౌ హజీ ఆదివారం తుది శ్వాస విడిచారు. కాస్త లేటుగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us