Adani Group : మరో మీడియా సంస్థని చేజిక్కించుకునే ప్రయత్నాల్లో అదానీ గ్రూప్.!

NQ Staff - August 25, 2022 / 09:52 PM IST

Adani Group : మరో మీడియా సంస్థని చేజిక్కించుకునే ప్రయత్నాల్లో అదానీ గ్రూప్.!

Adani Group : అదానీ గ్రూప్ మరో మీడియా సంస్థను తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఎన్టీటీవీలో పెద్దయెత్తున వాటాల్ని కొనుగోలు చేసేందుకు ఆదానీ గ్రూప్ ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కీలకమైన ముందడుగు కూడా వేసింది.

Adani Group is trying to take over another media company

Adani Group is trying to take over another media company

దేశంలో మీడియా సంస్థల్ని బీజేపీ, తమ వల్ల లాభపడ్డ వ్యాపారవేత్తలతో కొనుగోలు చేయిస్తోందంటూ ఎన్టీటీవీ వ్యవహారంపై విపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే.

బీజేపీతో అత్యంత సన్నిహితంగా ఆదానీ గ్రూప్..

ఆదానీ గ్రూప్ కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీతో అత్యంత సన్నిహితంగా మెలుగుతోంది. ఈ క్రమంలో దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్ని అదానీ గ్రూప్ దక్కించుకుంటోందన్న విమర్శలు లేకపోలేదు. ప్రతిఫలంగా బీజేపీకి సాయపడేందుకోసం మీడియా సంస్థల్లో ఆదానీ గ్రూప్ వాటాల్ని కొనుగోలు చేస్తోందని అనుకోవచ్చేమో.!

అయినా, రాజకీయ పార్టీలే సొంతంగా మీడియా సంస్థల్ని నడుపుతున్నప్పుడు, రాజకీయ పార్టీలకు మద్దతిచ్చే కార్పొరేట్ శక్తులు మీడియా సంస్థల్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడం అనేది పెద్ద విషయమే కాదు ఈ రోజుల్లో.!

సన్ గ్రూపుకి దేశంలోని పలు భాషల్లో న్యూస్ మరియు ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళున్నాయి. సౌత్‌లో సన్ గ్రూప్ మీడియా గురించి కొత్తగా చెప్పేదేముంది.?

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us