Abortion : అబార్షన్ ఆడవారి హక్కు..సుప్రీం సంచలన తీర్పు.! ఇక ప్రైవేట్ ఆసుపత్రులకు కాసుల వర్షం.!
NQ Staff - September 29, 2022 / 12:18 PM IST

Abortion : సర్వోన్నత న్యాయస్థానం అబార్షనల్ విషయమై సంచలన తీర్పుని వెల్లడించింది. పెళ్ళితో సంబంధం లేకుండా అబార్షన్ చేయించుకునే హక్కు మహిళలకు వుంటుందని సర్వోన్నత న్యాయయస్థానం స్పష్టం చేసింది. చట్ట పర్రకారం సురక్షితమైన అబార్షన్ చేయించుకోవచ్చన్నది సుప్రీంకోర్టు తాజాగా తన తీర్పులో పేర్కొన్న కీలక అంశం.
అయితే, ఎంటీపీ చట్టం ప్రకారం అబార్షన్ల విషయంలో వ్యవహరించాల్సి వుంటుందన్నది సర్వోతన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో మరో కీలకమైన పాయింట్. అబార్షన్ చట్ట ప్రకారం వివాహితులు, అవివాహిత స్త్రీలకు తేడా లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
అబార్షన్ల విషయంలో మహిళలక వేరొకరి అనుమతి లేదు.!
అబార్షన్ల విషయంలో మహిళలకు వేరొకరి అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. భర్త బలవంతంగా శృంగారం చేయడం వల్ల గర్భం వస్తే, తొలగించుకునే హక్కు భార్యకే వుంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. అత్యాచార ఘటనల్లోనూ అబార్షన్ వర్తిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టతనిచ్చింది.
అయితే, సుప్రీంకోర్టు తీర్పుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా అబార్షన్లు జరిగేందుకు ఆస్కారం ఏర్పుడుతందన్న వాదన తెరపైకొస్తోంది. ఇప్పటికే అబార్షన్ల విషయంలో ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి.
గర్భం తొలగింపు విషయమై భర్త అనుమతి లేకపోతే.. చాలామంది మహిళలు వేర్వేరు కారణాలతో, గర్భాల్ని తొలగించుకుంటారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, గర్భం దాల్చిన 24 వరకు అబార్షన్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొనడంతో.. ఇకపై దేశంలో రికార్డు స్థాయిలో గర్భస్రావాలు పెరుగుతాయనీ, ప్రైవేటు ఆసుపత్రులకు ఇది కాసుల పంట పండిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.