Abhishek Ray And Chaitanya Sharma : అట్టహాసంగా స్వలింగ సంపర్కుల వివాహం..కుటంబ సభ్యుల సమక్షంలో ఒక్కటైన ఇద్దరు మగాళ్లు
NQ Staff - July 6, 2022 / 12:59 PM IST

Abhishek Ray And Chaitanya Sharma : ప్రేమకు కులం, మతం, ప్రాంతం, వయస్సు, జెండర్ అనే తేడా ఉండదు అని కొన్ని సంఘటనలు చూస్తుంటే అర్ధమవుతుంది. ఒకప్పుడు అమ్మాయి, అబ్బాయి ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేసి ఒక్కటయ్యేవారు. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. లింగబేధం అనే తేడా ప్రేమలో పెడుతున్నారు. అమ్మాయితో మరో అమ్మాయే ప్రేమలో పడడం.. అబ్బాయిని మరో అబ్బాయి ప్రేమించడం ఇటీవల ఎక్కువగా చూస్తున్నాము.

Abhishek Ray And Chaitanya Sharma Gay Wedding
గేల వివాహం..
ఇది వరకటి రోజుల్లో స్వలింగ సంపర్కం అంటే ఏదో పెద్ద నేరంలా చూసేవారు. కానీ ఇప్పటి రోజుల్లో అది సాధారణమైన విషయం అయిపోయింది. వారి మనసులనూ, వారి ఆలోచనలనూ పెద్దలు అర్థం చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ లో ఇద్దరు గేలు కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో వివాహం చేసుకొని ఒక్కటైన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే కోల్ కతాలో చోటు చేసుకుంది.
కోల్‌కతా, గుర్గావ్‌లకు చెందిన మరో గే జంట కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా ఒక్కటయ్యారు. అభిషేక్ రే, చైతన్య శర్మ ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ మధ్య ఏర్పడిన ఈ ప్రేమ సంబంధాన్ని చిరకాలం కొనసాగించాలని.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. ఇందుకోసం ఇంట్లో వాళ్లను కష్టపడి ఒప్పించారు. వాళ్లు అంగీకరించడంతో సంప్రదాయబద్ధంగా జూన్ 3న వివాహం చేసుకున్నారు.

Abhishek Ray And Chaitanya Sharma Gay Wedding
పండితుల మంత్రోచ్ఛారణ చేయగా, దంపతులు ఒకరికొకరు పూలమాలలు వేసుకున్నారు. దీనితో పాటు, జంట పవిత్ర అగ్ని ముందు ఏడడుగులు ప్రదక్షిణలు చేశారు. కోల్‌కతా నగరంలో స్వలింగ సంపర్కుల వివాహాలు జరగడం ఇదే మొదటిసారి కానప్పటికీ, వివాహంలో హిందూ సంప్రదాయాలను పాటించడం ఇదే తొలిసారి. ఈ వివాహం ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీలో చేరాలనుకునేవారికి కొత్త ఆశను కూడా సృష్టించింది.
పెళ్లిలో అభిషేక్ రే ధోతీ, కుర్తా ధరించగా.. చైతన్య శర్మ షేర్వాణీ వేసుకున్నారు. శనివారం పెళ్లి జరగ్గా.. ఆదివారం కోల్‌కతాలో విందు కూడా ఏర్పాటు చేశారు. వీరి పెళ్లి, హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను వెడ్డింగ్ ప్లానర్ కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేశాడు. అందరూ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిషేక్ ఫ్యాషన్ డిజైనర్ కాగా.. చైతన్య జిటల్ మార్కెటింగ్ నిపుణుడు.