AB devilliers: రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన మ‌రో సీనియ‌ర్ క్రికెట‌ర్.. అద్భుత‌మైన ప్ర‌యాణం అంటూ ట్వీట్

AB devilliers: సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్, 360డిగ్రీల కోణంలో అద్భుతంగా ఆడ‌గ‌ల బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియ‌ర్స్ అంతర్జాతీయ క్రికెట్‌ కు గుడ్ బై చెబుతున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రిని షాక్‌కి గురి చేశాడు. వైవిధ్యమైన ఆటతీరుతో మైదానం నలుమూలల ఆడే ఏబీడిని అభిమానులు ముద్దుగా మిస్టర్ 360 అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. 2018లో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డివిలియర్స్.. అప్పటి నుండి ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.

retriment of cricket2
retriment of cricket2

రిటైర్మెంట్ ప్రకటించినా.. ఆటకు దూరమైనా అతనిలోని సత్తా మాత్రం ఏ మాత్రం తగ్గలేదని ప్రతీ సీజన్‌లోనూ నిరూపిస్తున్నారు.ఐపీఎల్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తూ వ‌స్తున్న డివిలియ‌ర్స్ తాజాగా తాను అన్ని ఫార్మాట్స్ నుండి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

ఇదొక అద్భుత‌మైన ప్ర‌యాణం.. అన్ని ఫార్మాట్స్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను.పెరట్లో మా అన్నయ్యలతో మ్యాచ్ అయినప్పటి నుండి, నేను స్వచ్ఛమైన ఆనందంతో మరియు హద్దులేని ఉత్సాహంతో ఆట ఆడాను. ఇప్పుడు, 37 ఏళ్ల వయస్సులో, ఆ జ్వాల అంత ప్రకాశవంతంగా మండదు.” అంటూ ట్వీట్‌ చేశారు ఏబీ డివిలియర్స్.

సుదీర్ఘ కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లాడిన డివిలియర్స్.. దక్షిణాఫ్రికా జట్టుకి కెప్టెన్‌గా కూడా పనిచేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి సుదీర్ఘకాలంగా డివిలియర్స్ ఆడుతున్న విషయం తెలిసిందే. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఏబీ డివిలియర్స్.. 114 టెస్టులాడి రెండు ద్విశతకాలు, 22 శతకాలు, 46 అర్ధశతకాలు సాధించాడు.

retriment of cricket1
retriment of cricket1

228 వన్డేలాడి 25 సెంచరీలు, 53 హాఫ్ సెంచరీలు చేశాడు. టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా తరఫున సెంచరీ చేయలేకపోయినా.. ఐపీఎల్‌లో మాత్రం ఈ హిట్టర్ మూడు సెంచరీలు బాది తన ముచ్చట తీర్చుకున్నాడు.