Viral News : వైరల్‌ : ఏడు నెలలుగా కోమాలోనే.. ఐనా బిడ్డకు జన్మనిచ్చిన మాతృమూర్తి

NQ Staff - October 31, 2022 / 11:51 AM IST

Viral News : వైరల్‌ : ఏడు నెలలుగా కోమాలోనే.. ఐనా బిడ్డకు జన్మనిచ్చిన మాతృమూర్తి

Viral News : వైద్య రంగంలో మరో అద్భుతం జరిగింది, ఏడు నెలలుగా కోమాలో ఉన్న గర్భిణి ఇటీవల పండంటి చిన్నారికి జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు ఆమె జన్మనిచ్చిన బిడ్డ ను ఆమె చూసుకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటికి కూడా ఆమె కోమాలోనే ఉన్నట్లుగా వైద్యులు తెలియజేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ ఎయిమ్స్ లో గత ఏడు నెలలుగా కోమాలో ఉన్న గర్భిణీ ఇటీవల డెలివరీ అయిందని ఆడ శిశువు జన్మించిందని వైద్యులు పేర్కొన్నారు. కోమాలో ఉన్నప్పటికీ స్వతహాగా గాలి తీసుకుంటున్నట్లుగా వైద్యులు పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చి 31న గర్భిణీ తన భర్తతో కలిసి బైక్ పై గర్భిణి వెళుతుంది. అప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది. గర్భిణీ తలకు బలమైన గాయమైంది. ఏప్రిల్ ఒకటో తారీఖున ఢిల్లీ ఎయిమ్స్ కి గర్భిణీని తరలించారు.

అప్పటి నుండి ఎయిమ్స్ అత్యవసర విభాగంలో ఆమెను ఉంచి చికిత్స అందిస్తున్నారు. మెదడులో ఎముక ఉండి పోవడం వల్ల ఆమె కోమాలో ఉన్నట్లుగా వైద్యులు పేర్కొన్నారు. ఆమెకు ఇప్పటికే ఐదు సర్జరీలు జరిగాయి.

ప్రమాదం జరిగిన సమయంలో ఆమె 40 రోజుల గర్భిణి, అప్పటి నుండి కడుపులో శిశువుని వైద్యులు పెంచుతూ వచ్చారు. మొదట అబార్షన్ చేయాలని భావించినప్పటికీ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దాంతో ఆమె కోమాలో ఉన్నా బిడ్డను ఆమె గర్భంలో పెంచుతూ వచ్చారు.

ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్న కారణంగా పుట్టిన ఆడ శిశువుకి పాలు ఇచ్చే అవకాశం లేదని వైద్యులు పేర్కొన్నారు. ఇది వైద్య చరిత్రలో ఒక మిరాకిల్ అంటూ డాక్టర్లు పేర్కొన్నారు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us