TTD : శ్రీవారికి ముస్లీం దంపతుల రూ. కోటి విరాళం

NQ Staff - September 21, 2022 / 02:52 PM IST

159876TTD : శ్రీవారికి ముస్లీం దంపతుల రూ. కోటి విరాళం

TTD : తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి చెన్నైకి చెందిన ముస్లీం దంపతులు సుబినా భాను, అబ్దుల్ గని లు కోటి రూపాయల విరాళంను శ్రీవారి సేవ కోసం అందించారు.

అన్న ప్రసాదం ట్రస్టు కు రూ.15 లక్షలు,

తిరుమలలో ఆధునికరించిన శ్రీవారి విశ్రాంతి భవనం నూతన ఫర్నిచర్ మరియు వంట శాల పాత్రలకు రూ. 87 లక్షల విరాళంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

A Muslim couple donates Rs1 crore to TTD

A Muslim couple donates Rs1 crore to TTD

ముస్లిం దంపతులు ఇచ్చిన కోటి రూపాయల వారిని విరాళం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. శ్రీవారికి ఎన్నో కోట్ల విరాళాలు అందుతూనే ఉంటాయి, కానీ ముస్లిం దంపతులు ఇచ్చిన ఈ కోటి రూపాయల విరాళం చాలా ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు.

ముస్లింలు అయి ఉండి ఇంత భారీ విరాళంలో ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం వారి తీరును తప్పుపడుతున్నారు. టీటీడీ అధికారుల పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.

ముస్లింలు ఇచ్చే విరాళము స్వీకరించాల్సిన అవసరమేంటి అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే.. మరి కొందరు మాత్రం ముస్లిం జంట తీరుని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.