Miracle : ఆటో డ్రైవర్ పంట పండింది… రూ.25 కోట్లు ఇప్పుడు అతడి సొంతం

NQ Staff - September 19, 2022 / 09:34 PM IST

159462Miracle : ఆటో డ్రైవర్ పంట పండింది… రూ.25 కోట్లు ఇప్పుడు అతడి సొంతం

Miracle : జీవితంలో అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతాయి అయితే అందరి జీవితాలు అద్భుతాలు జరుగుతాయని లేదు.. కొందరి జీవితంలో జరిగే అద్భుతాలు జీవితాన్ని మార్చేస్తుంటాయి. ఇప్పుడు కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన ఒక ఆటో డ్రైవర్ జీవితంలో అద్భుతం జరిగింది.

ఓనం బంపర్ లాటరీ లో ఏకంగా 25 కోట్ల

రూపాయలను అతను గెలుచుకున్నాడు. అతడు లాటరీ టికెట్ కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డ్రా తీసి విజేతను ప్రకటించడం అందులో అతని పేరు రావడం ఒక మిరాకిల్ అన్నట్లుగా జరిగింది.

A Miracle Happened In Life Of An Auto Driver

A Miracle Happened In Life Of An Auto Driver

పూర్తి వివరాల్లోకి వెళితే తిరువనంతపురంలో ఆటో డ్రైవర్ గా చేస్తున్న అనూప్‌ శనివారం లాటరీ టికెట్ ని కొనుగోలు చేయడం జరిగింది. ఆదివారం అతడికి రూ. 25 కోట్ల లాటరీ తగిలినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఆర్థిక ఇబ్బందులు పోగొట్టుకునేందుకు విదేశాలకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించి బ్యాంకులోను కోసం ప్రయత్నిస్తున్న అనూప్‌ కి అనూహ్యంగా రూ. 25 కోట్ల లాటరీని దక్కించుకోవడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనూప్‌ డబ్బు సంపాదన కోసం మలేషియా వెళ్లాలనుకున్నాడు కానీ ఇప్పుడు తనకు లాటరీ తగలడంతో మలేషియా వెళ్లాలని ఆలోచనను ఉపసంహరించుకున్నట్లుగా పేర్కొన్నాడు.

వెంటనే తాను ఒక మంచి ఇంటిని నిర్మించుకుంటానని పేర్కొన్నాడు. కేరళ రాష్ట్రానికి పన్నులు చెల్లించగా అనూప్‌ కి రూ. 15 కోట్లు రానున్నాయి. రూ. 25 కోట్ల లాటరీ నుండి 10 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉండగా 15 కోట్ల రూపాయలు అతడి చేతికి వస్తాయని డ్రా నిర్వహకులు తెలియజేశారు.