Wedding : విడ్డూరం : పెళ్లి భోజనంకి ఆధార్ తో లింక్‌ చేసిన వైనం

NQ Staff - September 27, 2022 / 01:18 PM IST

Wedding : విడ్డూరం : పెళ్లి భోజనంకి ఆధార్ తో లింక్‌ చేసిన వైనం

Wedding : ప్రభుత్వం అందించే పథకాలు కావాలి అంటే  తప్పనిసరి.. ఆధార్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అంటూ ఆ మధ్య బాగా హడావుడి జరిగింది. కానీ పథకాలకు ఆధార్ కి లింకు వద్దంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గింది.

ప్రభుత్వం వెనక్కు తగ్గింది కానీ ఉత్తరప్రదేశ్ లోని

ఒక పెళ్లి నిర్వహకులు మాత్రం విందు భోజనం చేయాలంటే ఆధార్ తప్పనిసరి చేసి వచ్చిన బంధుమిత్రులకు చుక్కలు చూపించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహాలోని అడంపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్‌పూర్‌ ప్రాంతంలో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి భారీ సంఖ్యలో బంధుమిత్రులు హాజరయ్యారు.

పెళ్లి అనంతరం విందు భోజనం సిద్ధమైంది, పెళ్లికి వచ్చిన వాళ్లంతా కూడా డైనింగ్ హాల్లో కి వెళ్ళేందుకు రెడీ అయ్యారు. డైనింగ్ హాల్ వద్ద ఉన్నవారు ఆధార్ కార్డు చూపిస్తేనే లోనికి పంపిస్తాం అంటూ కండిషన్ పెట్టారు.

పెళ్లికి వస్తూ ఆధార్ కార్డు ఎందుకు తీసుకొస్తామంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. తీసుకు రాని వాళ్ళు పక్కకు వెళ్ళండి ఆధార్ కార్డు ఉన్న వాళ్లు లోనికి వెళ్లి విందు భోజనం చేయండి అంటూ పెళ్లి నిర్వాహకులు ఖరా ఖండిగా చెప్పేశారు.

దీనికి కారణం పెళ్లి నిర్వాహకులు వెల్లడిస్తూ.. ఒకే సమయంలో పక్క పక్కనే రెండు పెళ్లిళ్లు జరిగాయి. దాంతో అక్కడ గందరగోళం ఏర్పడి ఒకే చోటుకి ఎక్కువ మంది రావడంతో ఇబ్బందులు తలెత్తాయి.

ఏం చేయాలో పాలు పోక ఆధార్ తప్పనిసరి పెట్టామంటూ వధువు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిజమైన బంధు మిత్రులు కూడా ఆధార్ కార్డు లేక పోవడంతో భోజనం చేయలేక పోయామంటూ పెళ్లికూతురు కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us