Google Maps : గూగుల్ మ్యాప్‌ని గుడ్డిగా న‌మ్మిన ఫ్యామిలీ.. కెనాల్‌లో కొట్టుకుపోయిన కారు..!

NQ Staff - August 13, 2022 / 12:01 PM IST

Google Maps : గూగుల్ మ్యాప్‌ని గుడ్డిగా న‌మ్మిన ఫ్యామిలీ.. కెనాల్‌లో కొట్టుకుపోయిన కారు..!

Google Maps : ఈ రోజుల్లో చాలా మంది గూగుల్ ఆధారంగా జీవించేస్తున్నారు. తెలియ‌ని విష‌యం ఏదైన ఉంటే గూగుల్‌లో వెతికేస్తున్నారు. , కొత్త లోకేషన్ లకు వెళ్లడానికి గూగుల్ తల్లిని నమ్ముకుంటారు. గూగుల్ లో లోకేషన్ ట్రాక్ చేసి.. దాన్నిపట్టుకుని వెళ్తుంటారు. అయితే.. చాలా వరకు గూగుల్ కరెక్ట్ లోకేషన్ కు తీసుకెళ్తుంది. కొన్నిసార్లు.. సాంకేతిక పొరపాట్లు లేదా అక్కడ వేరే ఇతర ప్రదేశాలు ఉంటే కాస్త అటూ ఇటూగా తీసుకెళ్తుంది.

గుడ్డిగా న‌మ్మోద్దు..

గూగుల్ మ్యాప్‌ని పూర్తిగా న‌మ్ముకున్నా కూడా ఒక్కోసారి విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర‌వు తుంటాయి. తాజాగా ఓ ఫ్యామిలీ గూగుల్ మ్యాప్ ద్వారా పెద్ద ప్ర‌మాద‌మే కొని తెచ్చుకుంది. కేరళలోని కొట్టాయం నుండి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారులో ప్రయాణిస్తున్నారు. వారు గూగుల్ మ్యాప్స్‌ని అనుసరిస్తూ వెళ్తుండగా.. దారి తప్పి కారు కాలువలో పడిపోయింది.

A Family Took Big Risk Through Google Maps

A Family Took Big Risk Through Google Maps

కొంత దూరం వరకు వీరు కొట్టుకుని పోయారు. కారులో ఉన్న వీరు కాపాడాలంటూ కేకలు వేశారు. వీరిని గమనించిన చుట్టుపక్కల వారు.. సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు, స్థానికులతో కలిసి.. ఒక తాడుతో కారును కట్టి సహాయక చర్యలు చేపట్టారు. తిరువాతుక్కల్‌-నాట్టకోమ్‌ సిమెంట్‌ జంక్షన్‌ బైపాస్‌ మీదుగా కుటుంబం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని కొట్టాయం పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ అనూప్‌ కృష్ణ తెలిపారు.

రాత్రి 10 గంటల తర్వాత ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే రంగంలోకి దిగడంతో ప్రయాణికులు మునిగిపోకముందే స్థానికులు వారిని రక్షించారు.గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఈ క్ర‌మంలో నెటిజ‌న్స్..గూగుల్ మ్యాప్‌ని గుడ్డిగా న‌మ్మోద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us