Viral Video : వైర‌ల్ వీడియో.. గ‌ణితం చ‌దివితే ఏం వ‌స్తుంది అన్న ప్ర‌శ్న‌కు చిన్నారి ఆస‌క్తిక‌ర స‌మాధానం!

NQ Staff - August 14, 2022 / 03:13 PM IST

151609Viral Video :   వైర‌ల్ వీడియో.. గ‌ణితం చ‌దివితే ఏం వ‌స్తుంది అన్న ప్ర‌శ్న‌కు చిన్నారి ఆస‌క్తిక‌ర స‌మాధానం!

Viral Video : ఇటీవ‌ల చిన్న పిల్ల‌ల‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వెరైటీ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో క్యూట్ క్యూట్‌గా వారు మాట్లాడుతున్న మాట‌ల‌కు నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. రీసెంట్‌గా ఓ చిన్నారి త‌న సారుని వెద‌వ అని తిడుతూ తెగ హంగామా చేసిన విష‌యం తెలిసిందే. ఈ వీడియోకి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది.

క్యూట్ ఆన్స‌ర్..

A Cute Video Of Little Boy Viral On Social Media

A Cute Video Of Little Boy Viral On Social Media

ఇక తాజాగా ఒక చిన్న పిల్లవాడికి సంబంధించిన చాలా అందమైన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఈ పిల్లాడి చిలిపి రియాక్షన్‌కు ఫిదా అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యాథ్స్ సబ్జెక్ట్ చదివితే వచ్చే లాభాల గురించి పిల్లవాడిని అడిగితే, అది విని అందరూ నవ్వుకోవాల్సినంత సమాధానం చెప్పడం వీడియోలో చూడొచ్చు.

లెక్కపెట్టేందుకు డబ్బులు లేనప్పుడు గణితం చదివి ఏం లాభం అంటూ.. చిన్నారి చెప్పిన ఈ క్యూట్ ఆన్సర్ విని ముఖంలో చిరునవ్వులు చిందించని వారు ఉండరంటే నమ్మశక్యం కాదు. అస్స‌లు అమాయ‌కంగా ఆ చిన్నారి అలాంటి స్ట‌న్నింగ్ ఆన్స‌ర్ ఎలా చెప్ప‌గ‌లిగాడు అని కొంర‌దు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

hey_its_me_abhirajbhavik అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు. దీనికి 94 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియో నిజంగా క్యూట్‌గా ఉందని, ఆ ప్రశ్నకు చిన్నారి చాలా అమాయకంగా సమాధానమిచ్చిందని ఓ యూజర్ చెప్పుకొచ్చాడు.