Viral Video : వైరల్ వీడియో: కన్నతల్లిపై పోలీసులకు మూడేళ్ళ చిన్నారి ఫిర్యాదు, జైల్లో పెట్టాలని డిమాండ్.!

NQ Staff - October 18, 2022 / 04:59 PM IST

Viral Video : వైరల్ వీడియో: కన్నతల్లిపై పోలీసులకు మూడేళ్ళ చిన్నారి ఫిర్యాదు, జైల్లో పెట్టాలని డిమాండ్.!

Viral Video : ఓ చిన్నారి.. ఆమెకు వయసు కేవలం మూడేళ్ళు మాత్రమే. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది. పోలీస్ అధికారికి ఫిర్యాదు చేసింది. ఎవరి మీద ఫిర్యాదు చేసిందో తెలుసా.? షాకింగ్‌గా ఆమె తనకు జన్మనిచ్చిన మాతృమూర్తి మీదనే కేసు పెట్టాలంటూ ఫిర్యాదులో పేర్కొంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది. ఘటన ఎక్కడ జరిగిందన్నదానిపై స్పష్టత లేదు. కానీ, చిన్నారి ఫిర్యాదు చేసేందుకు ఓ అప్లికేషన్‌లో విషయాన్ని పేర్కొంటున్న వైనం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఆ చిన్నారి అలా ఫిర్యాదు చేసేందుకు ఏవేవో రాస్తోంటే, పోలీస్ అధికారిణి ఆ మొత్తం వ్యవహారాన్ని ముచ్చటగా చూస్తుండి పోయారు.

పబ్లిసిటీ స్టంటు కాదు కదా.?

చిన్నారికి ఆ పోలీస్ స్టేషన్ గురించి ఎలా తెలిసింది.? మూడేళ్ళ చిన్నారి నేరుగా తన ఇంటి నుంచి ఒంటరిగా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళగలుగుతుందా.? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అదీ నిజమే.!
సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి ఇలాంటి వీడియోల్ని క్రియేట్ చేస్తున్నారు కొందరు. అలాంటిదే ఈ వీడియో అయి వుండొచ్చన్న డౌటానుమానం చాలామందిలో వుంది.

అన్నట్టు, ఎందుకు ఈ చిన్నారి, తన మాతృమూర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసిందో తెలుసా.? టాఫీలు.. అవేనండీ చాక్లెట్లు లాంటివి తన తల్లి దొంగిలించేస్తోందని. ఇది మరీ టూమచ్ కదా.?

 

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us