Viral Video : వైర‌ల్ వీడియో.. రిపోర్టర్‌గా మారిన 12 ఏళ్ల బాలుడు.. ఇద్దరు టీచర్లు సస్పెండ్!

NQ Staff - August 13, 2022 / 04:41 PM IST

151286Viral Video  : వైర‌ల్ వీడియో.. రిపోర్టర్‌గా మారిన 12 ఏళ్ల బాలుడు.. ఇద్దరు టీచర్లు సస్పెండ్!

Viral Video : 12 ఏళ్ల బాలుడు రిపోర్ట‌ర్ అవ‌తారం ఎత్తి త‌న స్కూల్ ప‌రిస్థితుల గురించి వివ‌రించాడు. పిల్లాడు చేసిన‌ పనికి ఇద్దరు టీచర్లు సస్పెండయ్యారు. ప్ర‌స్తుతం పిల్లాడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది. వివ‌రాల‌లోకి వెళితే ఝార్ఖండ్ గ్రామంలో చ‌దువుకుంటున్న పిల్లాడు మీడియా రిపోర్టర్ లాగా మారిపోయి స్కూల్ స‌మ‌స్య‌ల‌న్నింటిని వివ‌రించాడు.

స్కూల్ స‌మ‌స్య‌లు..

ఓ కర్రకు ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ తగిలించి దాన్నే మైక్గా ఫీలవుతూ.. పాఠశాల అంతా తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యలు విద్యార్థులు పడుతున్న బాధలన్నింటినీ వివరించాడు. ఇదంతా మరో విద్యార్థి వీడియో తీశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటుతిరిగి.. ఇటు తిరిగి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది.

A 12 Year Old Boy Impersonates Reporter And Describes Circumstances His School

A 12 Year Old Boy Impersonates Reporter And Describes Circumstances His School

దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా పాఠశాలలో సమస్యల పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. తమ పాఠశాలలో విద్యార్థులకు తాగడానికి నీరు కూడా లేదని.. పాఠశాల ఆవరణ అంతా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని విద్యార్థి సర్ఫరాజ్ ఆ వీడియోలో వివరించాడు.

అలాగే మరుగుదొడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని.. తరగతి గదుల్లో పశువుల మేతను పడేస్తున్నారన్నాడు. ఉపాధ్యాయులు విధులకు సరిగా రాకపోవడంతో విద్యార్థులు కూడా పాఠశాలకు హాజరుకావడం లేదని ఆ వీడియోలో సమస్యలను ఏకరవు పెట్టాడు. ఇప్పుడు మధ్యాహ్నం 12.45 అవుతున్నా టీచర్లు స్కూల్కు రాలేదంటూ తమ పాఠశాలలోని దుస్థితిని ఒక మీడియా రిపోర్టర్ మాదిరిగా చక్కగా ఆ వీడియోలో వివరించాడు. బుల్లి రిపోర్టర్ అవతారమెత్తిన 12 ఏళ్ల బాలుడు సర్పరాజ్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.