Panipuri: కూతురు పుట్టింద‌ని 50 వేలు ఖర్చు చేసి స్థానికులందరికీ ఉచితంగా పానీపూరి

Panipuri: ఈ రోజుల్లో కూతురు అంటేనే ఏదో రాక్ష‌సిలా ఫీల‌వుతున్నారు. పుట్ట‌గానే చెత్త కుప్ప‌ల్లో ప‌డేయ‌డం, చంపేయ‌డం వంటివి మ‌ర‌చిపోతున్నారు. కూతురిని క‌న్న త‌ల్లి కూడా ఆడ‌పిల్ల అని మ‌ర‌చిపోయి క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల ఓ చిన్నారిని చెత్త కుప్ప‌లో ప‌డేస్తే దారిన పోయే వారు శిశు శిబిరానికి తీసుకెళ్లారు. వారు ఆ చిన్నారిని అమెరికా వాసుల‌కి ద‌త్త‌గా ఇచ్చారు.

50K Panipuri Free For Born Daughter
50K Panipuri Free For Born Daughter

ఆడపిల్లను మహాలక్ష్మిలా భావించి సంతోష‌ప‌డాల్సిన వారు ఇలా మూర్ఖంగా వ్య‌హ‌రిస్తుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. తాజ‌గా ఓ పానీపూరి వ్యాపారి ఆడ‌పిల్ల పుట్ట‌డంతో ఎంతో సంతోషించాడు. కూతురు ప‌ట్టింద‌ని వేల రూపాయ‌లు ఖ‌ర్చు చేశాడు. ఈ సంఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లోని కోలార్‌లో జ‌రిగింది. అంచల్ గుప్తా అనే పానీ పూరి వ్యాపారికి ఆగస్టు 17న కూతురు పుట్టింది. ఆడపిల్లలతోనే భవిష్యత్తు బాగుంటుందని నమ్మే అంచల్‌కు కూతురు పుట్టిందన్న విషయం తెలిసి సంతోషించాడు.

కూతురు పుట్టింద‌న్న ఆనందంలో కోలార్ పట్టణంలో రూ.50వేల ఖర్చు చేసి స్థానికులందరికీ ఉచితంగా పానీపూరి అందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఆడపిల్ల పుట్టడం ఒక కల. నేను వివాహం చేసుకున్నప్పటి నుంచి నాకు అమ్మాయే పుట్టాలని కోరుకున్నా. కానీ మొదటి సంతానంలో రెండేళ్ల క్రితం కొడుకు జన్మించాడు.

అదృష్టం బాగుండి అమ్మాయి జ‌న్మించింది. ఈ ఆనందంతో భోపాల్ ప్రజలకు ఉచిత పానీ పూరీని అందించాలని నిర్ణయించుకున్నాను. అంతేగాక వారికి అమ్మాయిలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందనేనే సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను. నాకు చేతనైనంతలో ఏం చేద్దామని ఆలోచించి.. చివరకు ఉచిత పానీపురి పంపిణీ చేయాలనుకున్నాను. ఆడ పిల్ల‌లు, మ‌గ పిల్ల‌లు ఒక్క‌టే అని నిరూపించాల‌ని బావించి ఇలా చేశాను అంటున్నారు అంచ‌ల్‌. ఈ ప‌ని ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇత‌న‌ని చూసి కొంద‌రు సిగ్గు తెచ్చుకోవ‌ల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంద‌ని అంటున్నారు.