Jennifer Gates: 25 సంవత్సరాలకి కోట్లు సంపాదిస్తున్ప యువతి ఎవరో తెలుసా?

Jennifer Gates: జీవితంలో ప్రతి ఒక్కరూ సక్సెస్ సాధించడానికే తమ కెరీర్ ను స్టార్ట్ చేస్తారు. అలాంటిది 25 సంవత్సరాలకే లక్షల కోట్ల రూపాయలకు అధినాయకురాలు ఆమె.. త్వరలోనే పెళ్ళికి రెడీ అయ్యింది. ఆ రేంజ్ లో ఆస్తులున్నాయి అంటే ఆమె మరెవరో కాదు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూతురు జెన్నిఫర్ గేట్స్. రీసెంట్ గా బిల్ గేట్స్ తన భార్యతో విడాకుల గురించి తెగ వైరల్ అయ్యిన విషయం తెలిసిందే..

Interesting Facts About Jennifer Gates
Interesting Facts About Jennifer Gates

ఇలా జరగడం వల్లే బిల్ గేట్స్ కుమార్తె గురించి తెగ వెతికేస్తున్నారు. అసలు ఆమె ఎవరూ ఏంటి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బిల్ గేట్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో మొదటి కుమార్తె జెన్నీఫర్ గేట్స్. ఆమెకు 25 సంవత్సరాలు. తన తల్లిదండ్రుల విడాకుల విషయంలో తన కుటుంబానికి ఎలా అండగా నిలబడాలో తెలుసుకుంటున్నా.. అంటూ జెన్నీఫర్ తెలిపింది.

ఆమె నికర విలువ ఏకంగా 25 బిలియన్ డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు లక్షా 82వేల కోట్ల రూపాయలన్నమాట. అలాగే బిల్ గేట్స్ ఆస్తుల విలువ 130 బిలియన్ డాలర్లు. జెన్నీఫర్ సియాటెల్ లో లేక్ సైడ్ హై స్కూల్ లో చదువుకుంది. హ్యూమన్ బయాలజీలో గ్రాడ్యూయేషన్ సంపాదించింది. మౌంట్ సినాయ్ లో మెడిసన్ సెకండ్ ఇయర్ చదువుతుంది.

జెన్నీఫర్ చాలా టాలెంటెడ్. ఆమె ఆరేళ్ళ వయస్సులోనే గుర్రపు స్వారీ చేస్తుంది. ఆమెకు ఇష్టమైన గుర్రం పేరు అలెక్స్. అలాగే ఆమెకు ట్రావెలింగ్ అన్నా మక్కువే. జెన్నీఫర్ కు నాయల్ నాజర్ అనే ఈజిఫ్టియన్ తో ఎంగేజ్ మెంట్ అయ్యింది. వీరిద్దరూ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. వీరిద్దరూ రైడర్లుగా ఉన్నారు.

అలాగే జెన్నీ తన తల్లిదండ్రుల బాటలోనే నడుస్తోంది. ఎంతోమందికి తనకు తోచిన సహాయాన్ని చేస్తుంది. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ తనకు నచ్చిన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడం ఆమె స్పెషాలిటీ. ప్రపంచంలో తాను, తన కుటుంబంతో ఏ విధంగా జీవించాలనేది ఖచ్చితంగా ఆలోచిస్తామని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు జెన్నీఫర్.