Covid19: కరోనా చికిత్స కోసం రూ.22 కోట్ల బిల్ వేసిన హాస్పిటల్
Samsthi 2210 - July 1, 2021 / 03:30 PM IST

Covid19: ఓ వైపు కరోనా భూతం ప్రజలను అల్లాడిస్తుంటే… మరోవైపు ఆసుపత్రుల బిల్లు వారి ఇళ్లను గుల్లచేస్తోంది. కరోనాతో ఆసుపత్రిలో చేరి కోలుకున్నా కూడా కొందరికి మనశ్శాంతి ఉండడం లేదు. అందుకు కారణం కరోనా చికిత్సకి వారు వేసే బిల్లులే. మనదేశంలో లక్షలకు లక్షలు బిల్లులు వేసి సామాన్యులని సైతం వణికిస్తున్నారు ఆసుపత్రి వర్గాలు. అయితే అమెరికాలో నాలుగు నెలలు చికిత్స చేయించుకున్నందుకు 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 కోట్లు) బిల్లు వేసి నోట మాట రాకుండా చేశారు.

22 Cr Hospital Bill for Covid19 Patient
వివరాలలోకి వెళితే అమెరికాలో ఓ వ్యక్తి కరోనాతో ఆసుపత్రిలో షేర్ చేశాడు. నాలుగు నెలల పాటు కరోనాతో ఆసుపత్రిలో ఉన్న ఆ వ్యక్తికి ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చిన షాక్ తేరుకోకుండా చేసింది. దీంతో ఆ బిల్లును వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు బాధితుడు. నాలుగు నెలలకు 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 కోట్లు) బిల్లు వేయడాన్ని చూసి నెటిజన్స్ షాక్ అయ్యారు.
లెట్స్టాక్ అబౌట్ బిజినెస్ పేరుతో ఈ వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు ఆ వ్యక్తి. ప్రతీ సర్వీస్‌కు వేసిన ధరల వివరాలను వీడియోలో స్పష్టంగా వివరించారు. క్రిటికల్ కేర్, మెడికల్ స్కాన్స్‌తో పాటు మిగిలిన సేవలు ఆ జాబితాలో ఉన్నాయి. ఇక ఈ వీడియోకు కొన్నిరోజుల్లోనే దాదాపు 95 లక్షల వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ బిల్లుకు షాకైన చాలా మంది కామెంట్లు చేశారు. అయితే ఇవి ఆసుపత్రి బేసిక్ రేట్స్ అని, ఒకవేళ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బిల్లు చాలా తగ్గేదని కొందరు యూజర్లు కామెంట్ చేయగా.. మరికొందరు షాకయ్యామంటూ కామెంట్ చేశారు.
మన దగ్గరే లక్షల్లో బిల్లులు వేస్తుండగా, ఇక అమెరాకా అంటూ అధునాతనంగా వైద్య సదుపాయాలు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో ఆ మాత్రం బిల్లు వేయడం కామన్ కదా మరి కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మధ్య తరగతి ప్రజలు ఈ ఖర్చులను భరించడం చాలా కష్టంగా ఉంటుంది.
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. సెకండ్ వేవ్ బెడద కాస్త తగ్గుతున్నప్పటికీ థర్డ్ వేవ్ మళ్లీ మొదలు కానుండడంతో అందరిలో భయాందోళనలు కొనసాగుతున్నాయి.