Bike: బైక్‌పై 13 మంది ప్ర‌యాణం.. చూసిన వారంతో నోరెళ్ల‌పెట్ట‌డ‌మే..!

Bike: సోష‌ల్ మీడియాలో నిత్యం కొన్ని ఫ‌న్నీ వీడియోలతో పాటు ఇంట్రెస్టింగ్ వీడియోలు చ‌క్క‌ర్లు కొడుతుంటాయి. ఇవి నెటిజ‌న్స్ కి మంచి వినోదం అందించ‌డమే కాక ఆశ్చ‌ర్యాన్ని కూడా క‌లిగిస్తుంటాయి. తాజాగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియోని చూసి జ‌నాలు ముక్కున వేలేసుకుంటున్నారు. కొంద‌రు స్ట్రాంగ్‌గా కూడా కామెంట్స్ పెడుతున్నారు.

13 People in Single Bike
13 People in Single Bike

ఓ వ్యక్తి 13 మంది పిల్లలని తన బైకుపై ఎక్కించుకొని రోడ్డుపై తీసుకెళ్తున్నాడు. ఆ వ్య‌క్తి 13 మంది పిల్ల‌ల‌ని క‌న‌డ‌మే దారుణం అంటే మ‌ళ్లీ వాళ్లంద‌రిని బైక్‌పై ఎక్కించుకొని ప్ర‌యాణం సాగిస్తున్నారు. ఇందులో రెండేళ్ల వయసు నుంచి పదేళ్ల వయసు వారున్నారు. బైక్ సీట్లు, చక్రాలు ఇలా అదీ ఇదీ అని లేదు… ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడో చిన్నారిని సెట్ చేశాడు.

ముందు చుక్రంపై ఇద్ద‌రు పిల్ల‌ల‌ని, పెట్రోల్ ట్యాంక్‌పై ఐదుగురు పిల్లల్ని, ఓ పిల్లాడు అతని భుజంపై కూర్చున్నాడు. కొంత మంది పిల్లలు వేలాడుతున్నట్లుగా ఉన్నారు. అంతమందిని వేసుకొని హాయిగా డ్రైవ్ చేస్తున్నాడు. ఆ పిల్లలు కూడా “కా ప్యాన్ బచ్‌పన్ కా ప్యార్” అనే పాట పాడుతూ ఆనందంగా ఉన్నారు.స‌ర్క‌స్‌లో స్టంట్స్ చేస్తున్న‌ట్టుగా వారు అలా రిస్కీ ప్ర‌యాణం చేస్తున్నారు.

మంచిగా ఉన్నంత వ‌ర‌కు ఏం కాదు, ఎవ‌రైన జారి కింద ప‌డితే ఎవ‌రు దీనికి బాధ్యులు అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోకి లైక్స్ , కామెంట్స్ బాగానే వ‌స్తున్నాయి. అయితే ఎక్కువ మంది ఆ వ్య‌క్తిపై మండిప‌డుతున్నారు. పిల్ల‌ల‌తో అలాంటి ప్ర‌యాణాలు చేయోద్ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.