Connect with us

Latest News

ఆత్మహత్య చేసుకున్న టిక్ టాక్ ప్రేమ జంట

Published

on

Share the News from here

టిక్ టాక్ ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా లోని బెల్లంకొండ మండలం ఆర్ఆర్ సెంటర్ లో ప్రేమ జంట సూసైడ్ చేసుకోవడంతో విషాదం చోటు చేసుకుంది. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన శైలజ, మంగళగిరికి చెందిన పవన్ కుమార్‌లకు టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీనితో ఆ ప్రేమికులు ఇద్దరు కూడా ఆగస్టు మూడవ తేదీన తిరుపతిలో వివాహం చేసుకున్నారు.

తరువాత ఇద్దరు కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొత్త కాపురం మొదలు పెట్టారు. ఇక ఇదే సమయంలో శైలజ తల్లిదండ్రులు ఎంటర్ అయ్యారు. అయితే పవన్ ను వదిలేసి శైలజ ఇంటికి రావాలని ఆమె పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక అప్పటి నుండి శైలజ మొబైల్ వాడటం కూడా మానేసింది. ఇక ఆ తరువాత పవన్ కుమార్ ను శైలజ బందువులు చంపుతామని ఫోన్ చేసి బెదిరించారు. ఇక కలిసి బతికే పరిస్థితి లేదని, ఇద్దరు ఇంట్లో ఉరి వెసులుకోని చనిపోయారు.

అయితే చనిపోయే ముందు ఓ సూసైడ్ కూడా రాసింది శైలజ. తమ చావుకు గల కారణం తన తల్లిదండ్రులు అని సూసైడ్ నోట్ లో రాసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొన్నారు. అలాగే మృతులను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!