YS Sharmila : మొన్న ‘జై తెలంగాణ’.. ఈ రోజు ‘జై శంకర్’..

YS Sharmila : తెలంగాణలో పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల ఈ రాష్ట్రాన్ని ఓన్ చేసుకునే దిశలో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. మొన్ననే ‘జై తెలంగాణ’ అని గర్వంగా నినదించిన ఆమె ఈ రోజు జయశంకర్ సార్ కి మనస్ఫూర్తిగా జై కొట్టారు. ఆయన్ని తెలంగాణ జాతిపితగా అభివర్ణించారు. ఇవాళ బుధవారం వరంగల్ జిల్లా వైఎస్సార్ ఫ్యాన్స్ తో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జయశంకర్ సార్ తోపాటు కాళోజీ, దాశరథి వంటి మహానుభావులు ఎంతో మంది పుట్టిన గడ్డ ఓరుగల్లు అని షర్మిల చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన జాతీయ గీతాన్ని రాసిన సహజ కవి అందెశ్రీది కూడా ఓరుగల్లు గడ్డేనని పేర్కొన్నారు.

‘మిలియన్’కి పదేళ్లు..

తెలంగాణ ప్రాంత ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి గొప్పగా చాటి చెప్పిన ఘట్టం మిలియన్ మార్చ్. ఈ కార్యక్రమం సరిగ్గా పదేళ్ల కిందట ఇదే రోజు (మార్చి 10న) జరిగింది. ఆ విషయాన్ని షర్మిల ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీన్నిబట్టి ఆమె తెలంగాణ గురించి లోతుగా అధ్యయనం చేసి, పక్కా ప్లానింగ్ ప్రకారమే, లోకల్ సెంటిమెంట్ ని మరోసారి రగిలించే దిశగానే రాజకీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సమావేశానికి ముందు షర్మిల జయశంకర్ సార్ చిత్ర పటానికి పూల మాల వేసి, నివాళులర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ ని స్మరించుకోవటం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.

YS Sharmila : ys sharmila steadily owning telangana
YS Sharmila : ys sharmila steadily owning telangana

ఓరుగల్లు.. పోరుగల్లు: YS Sharmila

ఓరుగల్లు (వరంగల్) జిల్లా వందలాది మంది మడమ తిప్పని పోరాట వీరులను, అసమాన కళాకారులను అందించిన పోరుగల్లు అని, పురిటిగడ్డ అని వైఎస్ షర్మిల అన్నారు. వరంగల్ జిల్లా ఏక శిలా నగరమని, ఓరుగల్లు సాంస్కృతిక రాజధాని అని, రాణి రుద్రమ దేవి ఇక్కడే పుట్టారని తెలిపారు. ఇంత ఘన చరిత్ర కలిగిన నేలతో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతో అనుబంధం ఉందని షర్మిల గుర్తుచేసుకున్నారు. ఆ మహానేత బతికుంటే ఈ జిల్లా ఇప్పటికి శరవేంగా డెవల్మెంట్ అవుతుండేదని అభిప్రాయపడ్డారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేసిన ఘనత తన తండ్రిదేనని చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలోని ప్రధాన సమస్యలను వైఎస్ షర్మిల ప్రస్తావించారు.

Advertisement