YS Sharmila : బీజేపీ మునుగోడు వ్యూహం.! కమలానికి అండగా వైఎస్ షర్మిల.!
NQ Staff - October 5, 2022 / 12:09 PM IST

YS Sharmila : బీజేపీ రిమోట్గా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల మారబోతున్నారా.? అంటే, ఔననే చర్చ తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితిపై గత కొద్ది రోజులుగా విమర్శల తీవ్రత పెంచిన వైఎస్ షర్మిల, అవన్నీ బీజేపీ కనుసన్నల్లో చేస్తున్నారనే వాదనకు బలం చేకూరుతోంది.
కేసీయార్ కుటుంబం అలాగే టీఆర్ఎస్ మంత్రుల మీద వైఎస్ షర్మిలతో కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయించే యోచనలో బీజేపీ పెద్దలు వున్నట్లు కనిపిస్తోంది. ఇంకోపక్క, రాజగోపాల్ రెడ్డిని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమానిగా చూస్తూ.. మునుగోడులో ఆమె గెలుపు కోసం వైఎస్ షర్మిల సహకరించే అవకాశాలు కూడా వున్నాయట.
రంగంలోకి విజయమ్మ కూడా…
ఇప్పటికిప్పుడు తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ కొత్తగా బావుకునేదేమీ లేదన్న కోణంలో, కనీసం కాంగ్రెస్ పార్టీ అలాగే తెలంగాణ రాష్ట్ర సమితిని దెబ్బ తీయడం ద్వారా పొలిటికల్ వాక్యూమ్ అయినా సృష్టించాలన్న ఆలోచన షర్మిల చేస్తున్నారట.
ఈ క్రమంలో తన తల్లి వైఎస్ విజయమ్మతో మునుగోడులో పార్టీ పరంగా కాకుండా, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వీరాభిమానంతో వుండే రాజగోపాల్ రెడ్డి.. అనే కోణంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తరఫున ప్రచారం చేయించేలా వైఎస్ షర్మిలను బీజేపీ ఒప్పించినట్లు తెలుస్తోంది.
త్వరలో వైఎస్ షర్మిల, బీజేపీ పెద్దల్ని కలవనున్నారట. వైఎస్ షర్మిల ద్వారా మునుగోడుల బలపడేందుకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తెరవెనుకాల ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఆయనా అదను చూసుకుని బీజేపీలోకి దూకెయ్యడం ఖాయమైపోయిందట.