YS Sharmila : గవర్నర్ తో భేటీ కాబోతున్న వైఎస్ షర్మిల
NQ Staff - November 30, 2022 / 08:26 PM IST

YS Sharmila : తెలంగాణలో గత రెండు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఒక వైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర జరుగుతూ ఉండగా.. మరో వైపు వైయస్సార్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్రకు టిఆర్ఎస్ శ్రేణులు అడ్డు తలిగాయి.
తన వాహనంపై దాడి చేయడంతో పాటు తన కార్యకర్తలను అడుకుని పాద యాత్రను అడ్డుకోవడంతో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఏకంగా ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకొని వ్యక్తిగత పూచికతపై విడుదల చేశారు. షర్మిల అరెస్ట్ పై గవర్నర్ తమిళి సై రాజన్ స్పందించారు. ఈ నేపథ్యంలోనే రేపు రాజ్ భవన్ కి వెళ్లి వైయస్ షర్మిల ఉదయం 11:30 నిమిషములకు గవర్నర్ ను కలవబోతున్నారు.
ఆ సమయంలో ఏం మాట్లాడతారు అనే విషయమై అధికారికంగా క్లారిటీ లేదు.. కానీ తనపై జరుగుతున్న దాడుల పై గవర్నర్ కు ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి రాజకీయం గవర్నర్ వైపు వెళ్లడంతో ఆమె ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.