KCR : కేసీయార్ జాతీయ పార్టీలోకి వెళ్ళే ఆ ఉత్తరాంధ్ర నేత ఎవరు.?

NQ Staff - October 5, 2022 / 08:37 AM IST

KCR : కేసీయార్ జాతీయ పార్టీలోకి వెళ్ళే ఆ ఉత్తరాంధ్ర నేత ఎవరు.?

KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ స్థాయికి విస్తరించబోతున్నారు.. అదీ కొత్త పేరుతో.!

Who is that North Andhra leader who is going to KCR national party

Who is that North Andhra leader who is going to KCR national party

రేపు విజయదశమిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సమితికి పెట్టబోయే కొత్త జాతీయ ‘పేరు’ని ప్రకటించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కేసీయార్ సన్నిహితులైన ఆయా పార్టీల ముఖ్య నాయకులు హైద్రాబాద్‌కి చేరుకోవడం కూడా ప్రారంభమయ్యింది.

మధ్యాహ్నం ముహూర్తం..

రేపు మధ్యాహ్నం సరిగ్గా 1.19 నిమిషాలకు జాతీయ పార్టీ పేరుని కేసీయార్ ప్రకటిస్తారట. మరి, ఆంధ్రప్రదేశ్‌లో కేసీయార్ పార్టీ సంగతేంటి.? అంటే, ఇప్పటికే పలువురు ఏపీ నాయకులతో కేసీయార్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. లిస్టులో ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, వాళ్ళెవరూ ఇంతవరకూ కేసీయార్ పార్టీ విషయమై పెదవి విప్పలేదు.

కాగా, ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ పొలిటీషియన్, కేసీయార్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా వున్నారనీ, కీలకమైన పదవిలో కూడా ఆయన వున్నారనీ అంటున్నారు. ‘ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోతే నష్టమేంటి.?’ అని అన్నందుకు ఆయనకు ఉత్తరాంధ్ర ప్రజలు అప్పట్లో (సమైక్య ఉద్యమం నడుస్తున్న రోజుల్లో) చుక్కలు చూపించారట కూడా.

ఈ మధ్య తరచూ రాజధాని అమరావతి విషయమై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనీ, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచీ రాజకీయ విమర్శలు వివిధ కారణాల వల్ల ఎదుర్కొంటున్నారనీ అంటున్నారు. ఇంతకీ ఎవరా ఉత్తరాంధ్ర నేత.? జస్ట్ వెయిట్ అండ్ సీ.!

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us