Kishan Reddy : అందులో తప్పేముంది.? ఇంతలోనే మాట మార్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.!

NQ Staff - October 28, 2022 / 06:48 PM IST

Kishan Reddy : అందులో తప్పేముంది.? ఇంతలోనే మాట మార్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.!

Kishan Reddy : బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ పేరు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెరపైకి రావడంతో భారతీయ జనతా పార్టీ స్వరం మారింది.! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన బుకాయింపులకు దిగారు.

ఫరీదాబాద్‌కి చెందిన స్వామీజీ రామచంద్ర భారతి రంగంలోకి దిగి, నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ వైపుకు లాగేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అన్ని విషయాలూ బీఎల్ సంతోష్ చూసుకుంటారని స్వామీజీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో చెప్పిన ఆడియో బయటకు వచ్చింది.

తప్పేముందంటున్న కిషన్ రెడ్డి..

‘రాజకీయ నాయకులు పార్టీ మారడం సహజం.. అలాంటి నాయకుల కోసం ప్రయత్నిస్తే తప్పేంటి.?’ అంటూ కిషన్ రెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు.

‘సెకెండ్ హ్యాండ్ గాళ్ళని ఎవరైనా కొంటారా.? గెలిచే మొహాలు కావవి. పది రూపాయలు కూడా వాళ్ళకి ఖర్చు పెట్టుడు దండగ..’ అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ‘అసలు బీజేపీ అలాంటి ప్రయత్నాలు చేయలేదు..’ అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఏకంగా యాదాద్రి కొండపై ప్రమాణం చేస్తానంటూ హంగామా చేశారు.

‘మాకేం అవసరం..’ అంటూ నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో, ‘అందులో తప్పేముంది.?’ అంటున్నారు. ఇది కదా, రాజకీయమంటే.! బీఎల్ సంతోష్ పేరు తెరపైకి రాగానే మొత్తంగా ఈక్వేషన్ మారిపోయినట్లుంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us