‘ఆటలో అరటిపండు కూడా కాదు’ హైదరబాద్ నడిబొడ్డు లో పవన్ కి పేలింది .. ! 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ కి సిద్దం అంటూ ప్రకటించిన కొన్ని గంటల్లోనే జనసేన అధినేత పోటీ లేదు బీజేపీకి మద్దతు పలుకుతున్నట్లుగా ప్రకటించాడు. రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపిన సమయంలో మద్దతు ఇవ్వబోవడం లేదు అంటూ పవన్‌ ప్రకటించాడు. దాంతో బండి సంజయ్‌ మాట్లాడుతూ తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నాం. మాకు ఎవరి మద్దతు అక్కర్లేదు. జనసేన పార్టీతో పొత్తు ఏమీ లేదు. ఆ పార్టీతో ఏపీలో వరకే ఇక్కడ పొత్తు లేదంటూ వ్యాఖ్యలు చేశాడు. పవన్‌ కళ్యాణ్‌ నుండి పొత్తు విషయం మాకు ఎలాంటి సమాచారం లేదు కనుక మేము ఒంటరిగానే వెళ్తాం అంటూ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కూడా అన్నారు.
We do not want anyone's support : bandi sanjay
We do not want anyone’s support : bandi sanjay
బీజేపీ రాష్ట్ర నాయకత్వం చర్చలతో ఫలించనిది కేంద్ర నాయకత్వం చర్చలతో పవన్‌ దిగి వచ్చాడు. వెంటనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోటీ నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. జనసేన పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతు ప్రకటిస్తుందని, బీజేపీ అభ్యర్థుల కోసం ప్రతి ఒక్క జన సైనికుడు పని చేయాలంటూ పవన్‌ కళ్యాణ్‌ పార్టీ నాయకులను ఆదేశించారు. దాంతో పవన్‌ పై కొందరు విమర్శలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఈ ఎన్నికల్లో పరువు పోగొట్టుకోకుండా పవన్‌ మంచి నిర్ణయం తీసుకున్నాడు అంటున్నారు. బీజేపీ కోరితో పవన్‌ రెండు రోజుల పాటు ప్రచారం చేసేందుకు సిద్దం అయ్యాడు. కాని రాష్ట్ర నాయకత్వం మరియు ఇతర ముఖ్య నాయకులు సమాలోచనలు చేసి పవన్‌ ను ప్రచారంకు దూరంగా ఉంచారు.
పవన్‌ ఇక్కడ ప్రచారం చేస్తే జరిగే ప్రయోజనం కంటే లాస్‌ ఎక్కువ ఉంటుందని బీజేపీ నాయకులు ఊహించారు. ఖచ్చితంగా కేటీఆర్‌ మరియు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పవన్‌ ప్రచారం వల్ల బీజేపీని టార్గెట్‌ చేస్తారు. ఏపీ నాయకుడిని తీసుకు వచ్చి ఇక్కడ ప్రచారం చేయిస్తున్నారు. మీకు సొంతంగా సత్తా లేదా అంటూ కౌంటర్‌ కామెంట్స్‌ చేసే అవకాశం ఉందని బీజేపీ భావించింది. అందుకే పవన్‌ ను ఆటలో అరటిపండు కూడా కాదు అంటూ పక్కన పెట్టింది. హైదరాబాద్‌ లో పవన్‌ ను తిప్పకుండా ఆయనకు మొండి చేయి ఇచ్చింది. అర్జంట్‌ గా  ఢిల్లీ వెళ్లిన పవన్‌ వచ్చిన తర్వాత అయినా ప్రచారంలో పాల్గొనలేదు. ఇప్పటి వరకు బీజేపీ వారికి ఓట్లు వేయాలంటూ ఓటర్లను కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు. బీజేపీకి జనసేన మద్దతు కావాలి కాని పవన్‌ మద్దతు అక్కర్లేదా.. పాపం పవన్‌ కు హైదరాబాద్‌ నడి బొడ్డున ఇలా పేలింది ఏంటీ అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.
Advertisement