Health Director Srinivas : టైఫాయిడ్‌కి కొత్త పేరు పెట్టిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్

NQ Staff - November 25, 2022 / 01:55 PM IST

Health Director Srinivas : టైఫాయిడ్‌కి కొత్త పేరు పెట్టిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్

Health Director Srinivas : ఈ మధ్య తరచూ వివాదాల్లోకెక్కుతున్నారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. ముఖ్యమంత్రి కేసీయార్ పాదాలకు నమస్కరించి వార్తల్లోకెక్కిన శ్రీనివాస్, అది చాలదన్నట్టు.. ‘వందసార్లు మొక్కుతా.. అలా కేసీయార్ పాదాలను తాకడం నా భాగ్యం..’ అని తన విపరీత చర్యల్ని సమర్థించుకున్నారు.

తాజాగా, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ టైఫాయిడ్ విషయమై చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో వైరల్ అవుతోంది. టైఫాయిడ్‌కి కారణం పానీ పూరీ.. అని సంచలన వ్యాఖ్యలు చేశారాయన.

టైఫాయిడ్.. పానీ పూరీ డిసీజ్..

ప్రధానంగా ఈ సీజన్‌లో పానీ పూరీ అనేది టైఫాయిడ్ కేసుల పెరుగుదలకు కారణమవుతోందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. పానీ పూరీ కారణంగా సుమారు 2,700 టైపాయిడ్ కేసులు నమోదైనట్లు వివరించారాయన.

‘అయితే, కేసీయార్ కాళ్ళు మొక్కితే.. ఈ పానీపూరీ డిసీజ్ తగ్గిపోతుందన్నమాట..’ అంటూ శ్రీనివాస్ వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లేస్తున్నారు.

కాగా, టైఫాయిడ్‌కి పానీపూరీ డిసీజ్ అని నామకరణం చేశామనీ, కామెర్లు, ప్రేగులలో మంటకు కారణమయ్యే పానీపూరీని ఎక్కువగా తీసుకోకూడదనీ చెప్పుకొచ్చారు శ్రీనివాస్.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us