KCR : మాట తప్పిన కేసీయార్: చర్లగూడెం నిర్వాసితుల ‘కుర్చీ పే చర్చ’.!

NQ Staff - October 19, 2022 / 06:35 PM IST

KCR : మాట తప్పిన కేసీయార్: చర్లగూడెం నిర్వాసితుల ‘కుర్చీ పే చర్చ’.!

KCR : చర్లగూడెం రిజర్వాయర్‌ కారణంగా భూములు కోల్పోయిన బాధితులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ తమకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలంటూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.

‘కుర్చీ పే చర్చ’ అంటూ ఓ కుర్చీలో కేసీయార్ ఫొటో పెట్టి, ప్లకార్డులతో నిర్వాసితుల నిరసన తెలిపారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లి తండావాసులు మద్దిగూడ తహసీల్దారు కార్యాలయం యెదుట 45 రోజులుగా దీక్షలు చేస్తున్నారు.

కుర్చీలో కేసీయార్ ఫొటో.. వినూత్న నిరసన..

ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో ప్రభుత్వమే ఇళ్ళు కట్టించి పునరావాసం కల్పిస్తుందని కేసీయార్ గతంలో హామీ ఇచ్చారు. అయితే, ఆ హామీని నెరవేర్చలేదన్నది నిర్వాసితుల ఆవేదన. స్ట్రక్చర్ ప్రకారం ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరిగిందనీ, వాటితో ఒక అర్ర జాగా కూడా రాదని ముంపు బాధితులు వాపోతున్నారు.

‘ముంపు గ్రామాల ప్రజలకు ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని కేసీయార్ చెప్పారు.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు..’ అంటోన్న బాధితులు, తమకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించకపోతే మునుగోడు ఉప ఎన్నికలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించడం గమనార్హం.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us