Balapur Laddu : మళ్లీ రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ గణేషుడి లడ్డు
NQ Staff - September 9, 2022 / 02:44 PM IST

Balapur Laddu : ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం అంటే ఎక్కువ శాతం జనాలు ఆసక్తిగా ఎదురు చూసే విషయం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి లడ్డూ వేలం పాట. ప్రతి సంవత్సరం కూడా ఈసారి ఎంతకు లడ్డూ వేలం వెళ్తుంది అంటూ మీడియా కూడా ప్రత్యేక దృష్టిని అక్కడ పెడుతుంది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ గణేష్ లడ్డూ అత్యంత ప్రాచుర్యాన్ని సొంతం చేసుకుంది. 1994 సంవత్సరంలో రూ. 450 తో ప్రారంభమైన లడ్డు సంవత్సరం సంవత్సరం రేటు పెరుగుతూ ఏకంగా లక్షల రూపాయలు పలుకుతుంది.
గత సంవత్సరం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్,

Vangeti Lakshmareddy won Balapur Laddu
మర్రి శశాంక్ రెడ్డి కలిసి 18 లక్షల 90 వేల రూపాయలకు గాను లడ్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సంవత్సరం లడ్డూ వేలం పాటలో 24 లక్షల 60 వేల రూపాయలకు గాను వంగేటి లక్ష్మారెడ్డి సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన గురించి సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతుంది.

Vangeti Lakshmareddy won Balapur Laddu
బాలాపూర్ లడ్డును వేలం లో దక్కించుకున్న ఈయన ప్రముఖ వ్యాపారవేత్తగా సమాచారం అందుతుంది. లడ్డు వేలం పాట లో పలువురు పాల్గొనగా వంగేటి లక్ష్మారెడ్డి సొంతం చేసుకున్నారు.