TRS MLAs : బిగ్ ట్విస్ట్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల అరెస్ట్.!

NQ Staff - October 29, 2022 / 06:10 PM IST

TRS MLAs : బిగ్ ట్విస్ట్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల అరెస్ట్.!

TRS MLAs : తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ తరఫున ప్రయత్నాలు చేసిన ఇద్దరు స్వామీజీలు ఓ వ్యాపారి తాజాగా అరెస్టయ్యారు. ఈ కేసులో తొలుత పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకోగా, ఏసీబీ కోర్టు.. వారి రిమాండ్‌ని తిరస్కరించింది.

అయితే, సైబరాబాద్ పోలీస్ విభాగం, ఈ కేసులో హైకోర్టుని ఆశ్రయించడం గమనార్హం. హైకోర్టులోనూ తొలుత నిందితులకు కొంత అనుకూల పరిస్థితి కనిపించింది. ఇంతలోనే సీన్ మారింది.

సైబరాబాద్ పోలీసుల వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర యెదుట లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. లొంగిపోని సమక్షంలో నిందితుల్ని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరచాలని న్యాయస్థానం ఆదేశించింది.

నిందితుల అరెస్ట్..

ఈ నేపథ్యంలో పోలీసులు, నిందితుల్ని అరెస్ట్ చేశారు.. వారిని రిమాండ్‌కి తరలించినట్లు తెలుస్తోంది. ఫరీదాబాద్‌కి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, కోరె నందు కుమార్ అలియాస్ నందు, డీపీఎస్‌కవేీఎస్ సింహయాజి.. ఆ ముగ్గురు నిందితులు. మొత్తమ్మీద, ఎమ్మెల్యేలకు ఎర కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయన్నమాట.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us