TRS : టీఆర్ఎస్ నేతల్లో మొదలైన భయం.. అంతా సైలెంట్
NQ Staff - November 27, 2022 / 11:11 AM IST

TRS : తెలంగాణ అధికార పార్టీ నాయకుల ఇళ్ల పై ఐటీ అధికారుల సోదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మంత్రి కమలాకర్ మరియు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు మరియు మిత్రుల ఆఫీస్ లపై జరిగిన ఐటీ దాడులు జరిగాయి.
ఆ ఐటీ దాడులు ఇతర అధికార పార్టీ నాయకుల్లో గుబులు కలిగిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ నాయకులు ఈ విషయమై ఒకింత ఆందోళనతో ఉన్నారు.
కేంద్రం లో అధికారం లో ఉన్న బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుందో మల్లారెడ్డి ఇష్యూ తోనే క్లారిటీ వచ్చింది. కనుక ఇక నుండి నోరు అదుపులో పెట్టుకోవాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నారట.
కెసిఆర్ యొక్క ప్రశంసలు దక్కించుకోవడం కోసం అనవసరంగా బిజెపిని తిట్టడం మానుకోవాలని కొందరు టిఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారట, వీలుంటే టిఆర్ఎస్ ని వదిలి బిజెపిలో చేరేందుకు కూడా కొందరు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం అందుతుంది.
మొత్తానికి ఐటీ దాడులు భయం టిఆర్ఎస్ నాయకుల యొక్క ఫిరాయింపులకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి.