TRS : ఈసీ ముందుకు బీఆర్‌ఎస్ ఇష్యూ.. ఏం జరుగుతుందోని ఉత్కంఠ
NQ Staff - October 6, 2022 / 09:33 AM IST

TRS : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనంత పని చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ గత కొన్నాళ్లుగా చెబుతున్న కేసీఆర్, తన పంతం నెగ్గించుకునేందుకు జాతీయ పార్టీని ప్రారంభించారు.
టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా పేరు మార్చుతూ జాతీయ పార్టీ ఇంకా నిలిపేందుకు కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. దేశ వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీని ఇక బిఆర్ఎస్ గా ప్రచారం చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ నాయకత్వం తీర్మానం చేసి ఢిల్లీకి పంపించిన విషయం తెలిసిందే.
నేడు భారత ఎలక్షన్ కమిషన్ ని టిఆర్ఎస్ నేతల బృందం ఉదయం 11 గంటలకు కలవబోతోంది. ఈసీ ఇప్పటికే బిఆర్‌ఎస్ నాయకులకు ఉదయం 11 గంటలకు అపాయింట్మెంట్ ఖరారు అయినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయమై ఏసీ అలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది అనేది ఉత్కంఠ గా మారింది. ఒకవేళ టెక్నికల్ గా టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చే వీలులేదని ఈసీ చెప్తే కచ్చితంగా అప్పుడు కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.