Nusrat Jahan: మీ బిడ్డ‌కు తండ్రి ఎవ‌రంటూ ఎంపీకి ప్ర‌శ్న‌.. ఆమె చెప్పిన స‌మాధానం ఏంటో తెలుసా?

Nusrat Jahan: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ ఆగస్టు 26 కోల్‌కతాలోని నియోషియా ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విష‌యం తెలిసిందే. . ఆస్పత్రికి తీసుకెళ్లిన స‌మ‌యంలో నుస్రత్ జహాన్ వెంట బెంగాల్ నటుడు యశ్ దాస్ గుప్తా ఉన్నారు. దాస్ గుప్తానే నుస్రత్ జహాన్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారు.

Trinamool's Nusrat Jahan's Firm Response On Father Of Her Baby
Trinamool’s Nusrat Jahan’s Firm Response On Father Of Her Baby

నుస్రత్ జహాన్, నిఖిల్ జైన్ 2019లో టర్కీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత ఏడాదికే ఈ జంట విడిపోయారు. అధికారికంగా విడాకులు తీసుకోకపోయినప్పటికీ.. ఎవరి లైఫ్ వారు సోలోగా లీడ్ చేస్తున్నారు. భారతీయ చట్టాల ప్రకారం తమ పెళ్లి చెల్లుబాటు కాదని గతంలో నుస్రత్ జహాన్ వెల్లడించారు. నుస్రత్ జహాన్ బిడ్డకు జన్మనిచ్చిన స‌మ‌యంలో ఆమె మాజీ భర్త నిఖిల్ జైన్ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు.


‘మా మధ్య బేధాభిప్రాయాలు ఉండొచ్చు. అయినప్పటికీ,తల్లి అయిన ఆమెకు,బిడ్డకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఆ బిడ్డకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను.’ అని పేర్కొన్నారు. అయితే నుస్ర‌త్‌కి మీ అబ్బాయి తండ్రెవ‌రు అనే ప్ర‌శ్న ఎదురైంది.దానికి స్పందించిన ఆమె తన బిడ్డకు తండ్రెవరో ఆ తండ్రికి తెలుసు అని నుస్రత్ ఘాటుగా బదులిచ్చారు.


ఆగస్టు 26న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నుస్రత్, తల్లైన తర్వాత తొలిసారి బుధవారం కోల్‌కతాలోని ఓ సెలూన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సమయంలో పాత్రికేయులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించగా.. తన బిడ్డకు తండ్రెవరో చెప్పమని మహిళను అడగడం ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచటమేనని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృత్వపు అనుభూతి కొత్తగా ఉందన్న నుస్రత్.. తన కుమారుడి పేరు ఇషాన్ అని వెల్లడించారు.


నుస్రత్ జహాన్ బెంగాలీ ముస్లిం కుటుంబంలో 1990లో జన్మించారు. 2011 నుంచి ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకూ 20 పైచిలుకు సినిమాల్లో నటించారు. 2019లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నుస్రత్ జహాన్… బసిర్‌హత్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. దాదాపు 3,50,000 వేల ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు.