YS Sharmila : వైఎస్సార్ మరణంపై మొదటి నుంచీ అనుమానాలున్నాయ్ : వైఎస్ షర్మిల
NQ Staff - September 21, 2022 / 12:19 AM IST

YS Sharmila : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారనే మాటకు కట్టుబడి వున్నామనీ, ఆ అనుమానం వైఎస్సార్ కుటుంబ సభ్యులకు మొదటి నుంచీ వుందనీ అంటున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.

There were suspicions about YSR death from the beginning says YS Sharmila
‘వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారు. అలాగే నన్ను కూడా చంపాలనుకుంటే చంపేస్తారు. ఊపిరి వున్నంతవరకూ తెలంగాణ ప్రజల కోసం పోరాడాలనుకుంటున్నాను..’ అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.
పాదయాత్రలో వైఎస్ షర్మిలతో న్యూస్ క్యూబ్..
వైఎస్ షర్మిల వెంట పాదయాత్రలో న్యూస్ క్యూబ్ ప్రతినిథి శ్రావణి మాట్లాడుతూ, ఆమెను వైఎస్సార్ మరణం గురించి అడిగినప్పుడు పై విధంగా స్పందించారు.
‘ఆ ఘటన కాంగ్రెస్ హయాంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి తెచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అలాంటి రాజశేఖర్ రెడ్డి అనుమానాస్పద రీతిలో హెలికాప్టర్ ప్రమాదంలో జరిగితే ఎందుకు తగిన విచారణ చేయించలేదు.?’ అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.
‘అప్పట్లో రిలయన్స్ మీద వైఎస్సార్ అభిమానులు దాడులు చేశారు కదా.? ఆ రిలయన్స్ అధినేతల మీదనే ఆరోపణలు వచ్చాయి కదా.?’ అని ప్రశ్నిస్తే, ‘ఫలానా వారి వల్ల అని నేను ఆరోపణలు చేయను. మాకు అనుమానాలున్నాయ్.. విచారణ జరిపించలేదు..’ అని షర్మిల చెప్పుకొచ్చారు.