కే‌సి‌ఆర్ కి మోడీ అంత పెద్ద వార్నింగ్ ఇచ్చాడా ? అందుకే ఈ నిర్ణయాలు ? ఆ రోజు ఏమైందంటే !

Admin - January 1, 2021 / 01:00 PM IST

కే‌సి‌ఆర్ కి మోడీ అంత పెద్ద వార్నింగ్ ఇచ్చాడా ? అందుకే ఈ నిర్ణయాలు ? ఆ రోజు ఏమైందంటే !

తెలంగాణాలో రాజకీయం మారుతుంది. ఇన్ని రోజులు బీజేపీ పై మాటల యుద్ధం చేసిన కెసిఆర్ రివర్స్ గేర్ వేసినట్లే కనిపిస్తుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తలపెట్టే ప్రతి పథకాన్ని తప్పు పడుతూ కాస్త విమర్శలు చేసేది. ఉన్నట్టుండి బీజేపీ కి మద్దతుగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు గులాబీ బాస్. అయితే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకంలో లోపాలు ఉన్నాయని.. అందుకోసమే తెలంగాణాలో ఆ పథకాన్ని అమలు చేయడం లేదని ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. ఒకవైపు ఈ పథకాలన్నీ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ ప్రశ్నించిన పెద్దగా పట్టించుకునేది కాదు.

KCR easily found in BJP trap

ఇప్పుడు తెలంగాణాలో రాజకీయాలు మారిపోయాయి. దీనితో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణాలో కూడా అమలు చేస్తామని, లేకపోతే తెలంగాణ ప్రజలు నష్టపోతారని అభిప్రాయపడుతున్నాడు. దీనితో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పీఎం వీడియో కాన్ఫిరెన్స్ లో తెలంగాణాలో ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తామని ప్రధానికి సూచించారు. ఇక ఆ తరువాత ప్రెస్ నోట్ ద్వారా ఈ విషయాన్నీ వెల్లడించారు. దీనితో రాజకియ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

modi kcr

ఇన్నిరోజులు బీజేపీపై విరుచుకుపడిన కెసిఆర్ ఒక్కసారిగా ఇలా మారిపోయాడేమిటని ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికల నుండి రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంది. ఇన్నిరోజులు రాజకీయంగా రాష్ట్రంలో తనకు తిరుగులేదని భావించిన కెసిఆర్ కు బీజేపీ కాస్త తలనొప్పిగా మారింది. ఇక ఇదే తరుణంలో బీజేపీ తో దోస్తీ గట్టే ఆలోచనలో కెసిఆర్ ఉన్నాడట. అందుకోసమే కేంద్ర ప్రభుత్వ పథకాలను జై కొడుతున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

అలాగే ఆ మధ్య ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కూడా కలిశాడు. ఇక చర్చలో రాష్ట్ర బీజేపీ ప్రస్తావన కూడా ఎత్తాడట. భవిష్యత్ లో బీజేపీ తో కలసి నడవాలని పలు అంశాలు మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి కెసిఆర్ బీజేపీ తో దోస్తీ కడతాడా.. లేక గస్తీ కడతాడా అనేది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us