BRS : బీఆర్‌ఎస్ కోసం ఆ గ్రామం మొదటి విరాళం
NQ Staff - October 6, 2022 / 09:59 AM IST

BRS : బీఆర్‌ఎస్ జాతియ పార్టీకి 66,000 రుపాయల సొయా పంటను విరాళంగా ప్రకటించిన ముఖరా కె ధలితబస్తి వాసులు మొదటి విరాళం ను ప్రకటించారు. ఈ పార్టీ ప్రారంభించడంతో దేశంలో మా లాంటి ఎన్నో కుటుంబాలకు పెద్ద దిక్కు కేసీఆర్ పెద్ద దిక్కు అవుతారు అంటూ గ్రామస్తులు పేర్కొన్నారు.
జాతియ పార్టీ ప్రకటిస్తునందుకు విరాళం సోయా పంట ను విరాళంగా ప్రకటించారు ఈ ధలిత కుటుంబాలు. ముఖరా కె గ్రామంలొ 33 మంది ధలిత కుటుంబాలకు 99 ఎకరాలు భుమి ధలిత బస్తి కింద కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.
ముఖ్యమంత్రి కేసీఅర్ గారు కూలీలుగా ఉన్న తమని రైతుగా మార్చారు. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటామని వారి పంట పొలాల్లో పండి సోయ పంటను మనిసికి 50 kg చొప్పున 16.50 కింట్వాల్ సోయాను అంటే 66,000 రుపాయల సొయాను బీఆర్‌ఎస్ పార్టీకి విరాళంగా ప్రకటించినట్లుగా పేర్కొన్నారు.
కెసిఅర్ గారికి పంపల్సిందిగా ముఖ్రా కె సర్పంచ్ గాడ్గె మినాక్షి కి అందజెసారు….ఈ సందర్బంగా సోయ పంట లో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఇంకా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించే పనిలో జాతియ నాయకత్వం బిజీగా మారబోతున్నట్లుగా తెలుస్తోంది.