Telangana : ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ముఖ్య విజయాల్లో ఇదొకటి’’

Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాల్లో ఒకటి అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ బుధవారం ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అన్ని గవర్నమెంట్ ఉద్యోగాల్లో 95 శాతం ఖాళీలు ఇకపై స్థానికులకే లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన కొత్త జోనల్ విధానం వల్ల తెలంగాణ యువత న్యాయమైన వాటాను పొందొచ్చని తెలిపారు. ఏడు జోన్లను, రెండు మల్టీ జోన్లను తెలిపే తెలంగాణ రాష్ట్ర చిత్ర పటాన్ని, కొత్త జోనల్ విధానంపై ఇవాళ న్యూస్ పేపర్లలో వచ్చిన క్లిప్పింగులను కేటీఆర్ తన పోస్టుకి యాడ్ చేశారు. 7 జోన్లు.. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ. 2 మల్టీ జోన్లు.. కాళేశ్వరం-బాసర-రాజన్న-భద్రాద్రి; యాదాద్రి-చార్మినార్-జోగులాంబ.

telangana-this-is-one-of-the-important-victories-of-telangana-state
telangana-this-is-one-of-the-important-victories-of-telangana-state

జిల్లాల వారీగా జోన్లు..

మొదటి(కాళేశ్వరం) జోన్ పరిధిలోకి వచ్చే జిల్లాలు.. ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్. రెండో(బాసర) జోన్ పరిధిలోకి వచ్చే జిల్లాలు.. జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్. మూడో(రాజన్న) జోన్ లోకి వచ్చే జిల్లాలు.. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల. నాలుగో(భద్రాద్రి) జోన్ లోకి వచ్చే జిల్లాలు.. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్. ఐదో(యాదాద్రి) జోన్ లోకి వచ్చే జిల్లాలు.. నల్లగొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి భువనగిరి. ఆరో(చార్మినార్) జోన్ లోకి వచ్చే జిల్లాలు.. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్-రంగారెడ్డి, మేడ్చల్. ఏడో (జోగులాంబ) జోన్ లోకి వచ్చే జిల్లాలు.. మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల.

తొలగిన అడ్డంకి: Telangana

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల భర్తీకి ఇంతకాలంగా ఉన్న ప్రధాన అడ్డంకి తొలిగిపోయింది. జోన్ల వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. దీంతో మొత్తం 33 జిల్లాలకు గుర్తింపు లభించింది. గతంలో 31 జిల్లాలకే రాష్ట్రపతి ఓకే చెప్పారు. వాటికి మరో రెండు జిల్లాలను కలపగా మరోసారి ‘రైట్’ అన్నారు. దీంతో చాలా కాలంగా హోం శాఖలో పెండింగ్ లో ఉన్న ఈ ఫైల్ ఎట్టకేలకు క్లియర్ అయింది.

Advertisement