Telangana : పోలవరం రగడ : ఆంధ్రప్రదేశ్ ఆ ఐదు గ్రామాల్నీ కోల్పోతుందా.?

NQ Staff - July 24, 2022 / 07:09 PM IST

Telangana : పోలవరం రగడ : ఆంధ్రప్రదేశ్ ఆ ఐదు గ్రామాల్నీ కోల్పోతుందా.?

Telangana : ‘మాకు ఆంధ్రప్రదేశ్ వద్దే వద్దు.. మాకు తెలంగాణ ముద్దు.. మమ్మల్ని తెలంగాణలో కలిపెయ్యండి..’ అంటూ పోలవరం ముంపు ప్రాంతంలోని ఐదు గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో నినదిస్తున్నారు. పంచాయితీ తీర్మానాలు జరిగాయి. ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి నదికి సంభవించిన భారీ వరదల నేపథ్యంలో ముంపు ప్రాంతంలో ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. తెలంగాణలోనూ, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ ముంపు ప్రాంతం వుంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని ముంపు ప్రాంత ప్రజలు.. అది కూడా గతంలో ‘ముంపు మండలాలు’గా ముద్రపడి, ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన భూభాగంలోని ఐదు గ్రామాలు మాత్రమే తమను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తుండడం గమనార్హం.

ప్రజా ఉద్యమం షురూ.. ఏపీ దిగిరాక తప్పదంతే.!

Telangana Rashtra Samiti Comments Five Villages will Come Telangana

Telangana Rashtra Samiti Comments Five Villages will Come Telangana

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తొలుత ముంపు మండలాల్లోని ఐదు గ్రామాల గురించి నినదించారు. ఆ తర్వాతే అక్కడ, ఉద్యమం మొదలైంది. ‘ఇది ప్రజా ఉద్యమం.. పాలకులు దిగిరాక తప్పదు. కరకట్ట కోసమే మేం ఆ ఐదు గ్రామాలు అడుగుతున్నాం..’ అని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెబుతున్నారు.

కాగా, తెలంగాణలోని అధికార పార్టీ.. విపక్షాల నుంచి ఎదురవుతున్న గట్టి పోటీ నేపథ్యంలో తమ వైఫల్యాల్ని కప్పి పుచ్చుకునేందుకు ముంపు ప్రాంతం పేరుతో ఐదు గ్రామాల ప్రజల్ని రెచ్చగొడుతోందని ఏపీ మంత్రులు చెబుతున్నారు.

ఒక రాష్ట్రంలోని సమస్యను ఇంకో రాష్ట్రం రాజకీయంగా క్యాష్ చేసుకోవాలనుకోవడం మంచిది కాదు. ఆ ఐదు గ్రామాలు తెలంగాణకే వచ్చేస్తాయన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న వ్యాఖ్యలు.. ఇరు రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాల్ని చెడగొడతాయి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us