Bharat Rashtra Samithi : దేశ్ కీ నేతా కేసీయార్.! టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్.!

NQ Staff - October 5, 2022 / 05:23 PM IST

Bharat Rashtra Samithi : దేశ్ కీ నేతా కేసీయార్.! టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్.!

Bharat Rashtra Samithi : తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మారింది. ఇకపై అది భారత్ రాష్ట్ర సమితి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి స్టేట్ జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పంపింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పోటీ చేయబోతోందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. అప్పటికల్లా జాతీయ పార్టీ నిర్మాణం పూర్తిస్థాయిలో జరుగుతుందా.? అంటే, అదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న.

మునుగోడు ఉప ఎన్నికతోనే..

త్వరలో తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండగా, ఆ ఉప ఎన్నికలో భారత్ రాష్ట్ర సమితి జెండా మీదనే ‘గులాబీ’ అభ్యర్థి పోటీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

కాగా, భారత్ రాష్ట్ర సమితి పేరుని టీఆర్ఎస్ అధినేత కేసీయార్ ప్రకటించగానే, పార్టీకి చెందిన ముఖ్య నేతలు కరతాళధ్వనులతో ముఖ్యమంత్రి కేసీయార్‌ని కీర్తించారు. ‘దేశ్ కీ నేతా కేసీయార్..’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చడంతోనే కేసీయార్ దేశ్ కీ నేతా అయిపోయినట్లేనా.? అంతే, అలా అనుకోవాల్సిందే.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us