KTR : మంత్రి కేటీయార్ వాట్సాప్ బంద్.! అసలేమయ్యిందబ్బా.?

NQ Staff - July 27, 2022 / 08:39 AM IST

KTR : మంత్రి కేటీయార్ వాట్సాప్ బంద్.! అసలేమయ్యిందబ్బా.?

KTR : ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 8 వేల మెసేజ్‌లు వచ్చాయట ఒక్క రోజే మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకి. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ అలాగే పురపాలక శాఖ మంత్రి కావడం.. ముఖ్యమంత్రి కేసీయార్ తనయుడు కావడంతో.. కేటీయార్ పుట్టినరోజుకి ఆ స్థాయిలో శుభాకాంక్షలు వాట్సాప్ ద్వారా వెల్లువెత్తకుండా వుంటాయా.?

Telangana IT minister KTR gets locked out of WhatsApp after spam deluge

Telangana IT minister KTR gets locked out of WhatsApp after spam deluge

అలా వచ్చిన మెసేజ్‌లకు సంబంధించి ‘స్పామ్ అలర్ట్’ అనుమానం కారణంగా, వాట్సాప్ ఖాతా తాత్కాలికంగా బంద్ అయ్యింది. ‘స్పామ్ కారణంగా వాట్సాప్ అకౌంట్ వినియోగానికి వీలు పడదు..’ అంటూ మెసేజ్ వచ్చిందట వాట్సాప్ నుంచి.

డిజిటల్ ఛాలెంజెస్..

ఈ మొత్తం వ్యవహారాన్ని సోషల్ మీడియాలో పేర్కొంటూ, డిజిటల్ ఛాలెంజెస్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మంత్రి కేటీయార్. ఒకటేమిటి.? వందేమిటి.? వేలు, లక్షల మెసేజ్‌లు వచ్చినా వాట్సాప్ అకౌంట్ అయితే పని చెయ్యాలి కదా.? బహుశా ఇదే కేటీయార్ ప్రశ్న కూడా అయి వుండొచ్చు.

తనకు వచ్చిన మెసేజ్‌లన్నిటికీ రిప్లయ్ ఇచ్చేందుకు మేగ్జిమమ్ ప్రయత్నించాననీ, వాట్సాప్ ఖాతా తాత్కాలికంగా బంద్ కావడంతో తన ప్రయత్నాలు ముందుకు సాగలేదని చెప్పారు కేటీయార్. అద్గదీ అసలు సంగతి. ఇ:తకీ, ఇప్పటికైనా కేటీయార్ వాట్సాప్ ఖాతా పునరుద్ధరిబచబడిందా.? లేదా.? కేటీయార్ స్పష్టతనివ్వాల్సి వుంది.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us