CP Sajjanar: టీఎస్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. స‌జ్జ‌నార్ ఆక‌స్మిక బ‌దిలీ

CP Sajjanar: సీపీ స‌జ్జ‌నార్.. ఈ పేరు మ‌న రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా పాపుల‌ర్. వరంగల్ యాసిడ్ దాడి కేసులో ఎన్ కౌంటర్, శంషాబాద్ దిశ ఎన్ కౌంటర్‌లు సజ్జనార్‌ను దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచేలా చేశాయి. మల్టీ లెవెల్ స్కాములను ఛేదించడంలో సజ్జనార్‌కు మంచి పేరుంది. కరోనా సమయంలో ప్లాస్మా డొనేషన్‌లో విశేష సేవలు అందించారు.


Telangana Government Transferred CP Sajjanar
Telangana Government Transferred CP Sajjanar

వీసీ స‌జ్జ‌నార్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం బ‌దిలీ చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆయనను టీఎస్ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సజ్జనార్ స్థానంలో కొత్త సీపీగా స్టీఫెన్ రవీంద్రను నియమించింది. 1999 బ్యాచ్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుతం వెస్ట్ జోన్ ఐజీపీగా బాధ్యతలు చేపడుతున్నారు.

పోలీస్ శాఖలో సమర్థుడైన అధికారిగా ర‌వీంద్ర‌కు పేరు వుంది. ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్స్‌ ఆటకట్టించడంతో పాటు సంఘ వ్యతిరేక శక్తుల పాలిట సింహాస్వప్నంగా నిలిచారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉద్యమ నేతలు కేటీఆర్, హరీశ్‌లు పలు సందర్భాల్లో స్టీఫెన్ రవీంద్రను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అయితే స‌జ్జ‌నార్‌ని ఆక‌స్మిక బ‌దిలీ చేసి ర‌వంద్ర‌ను నియ‌మించ‌డం ప‌ట్ల ప‌లు అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

కాగా, 1996 బ్యాచ్‌కు చెందిన వీసీ సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా మూడేళ్ల పాటు సేవలు అందించారు. రోవైపు మెదక్ జిల్లాకు ఎస్పీగా సజ్జనార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగర్ B కు చెందిన గంజాయి స్మగ్లర్ బిక్యూ పవర్ అలియాస్ బిఖ్య నాయక్‌ను ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. అప్పట్లో బిఖ్య నాయక్, భార్య రుక్మబాయి గంజాయి ముఠాను పట్టుకొని రోడ్డు పక్కన ఉండడంతో .. కర్ణాటకలోని బార్డర్ క్రైమ్ మీటింగ్‌కు వెళ్తున్న సురేష్ అనే కానిస్టేబుల్ (30 మార్చి 2010) వాళ్ళను వెంబడించాడు.

అయితే రుక్మ బాయి, బిఖ్య నాయక్‌లు కలసి కానిస్టేబుల్ సురేష్‌ను హత్య చేసి.. మహారాష్ట్ర పారిపోయారు. దీంతో పోలీసులకు బిఖ్య నాయక్‌కు పట్టుకోవాలంటే సవాలుగా మారింది. సుమారు నెల రోజులు అనగా 20 ఏప్రిల్ 2010 నాడు నిందితుడు బిఖ్య నాయక్‌ తిరిగి స్వగ్రామం వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరుణంలో నాయక్ పోలీసులపై కాల్పులు జరపగా.. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపి బిఖ్య నాయక్‌‌ను కాల్చి చంపారు.

ఇలా పలు ఎన్‌కౌంటర్లలో డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న సజ్జనార్.. కడప జిల్లాలో పులివెందుల ఏఎస్పీతో పాటుగా కూడా పని చేసిన సమయంలో కూడా ఎన్‌కౌంటర్లు చేశారు. 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఇటీవలే ఆయన అడిషనల్ డీజీ ర్యాంకు ప్రమోషన్ పొందారు.