Telangana : తెలంగాణలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్.!
NQ Staff - July 30, 2022 / 09:25 AM IST

Telangana : కరోనా వైరస్ ఖేల్ ఖతం అయినట్లే.! కోవిడ్ పాండమిక్ దాదాపుగా ముగిసినట్లే.! ఇలాంటి ప్రకటనల్ని నిన్న మొన్నటిదాకా ప్రభుత్వాల నుంచే విన్నాం. కానీ, సీన్ మారుతోంది. దేశంలో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కోవిడ్ 19 కేసుల సంఖ్య 20 వేల పైనే వుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రమక్రమంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

Telangana covid case Growing up
ఆంద్రప్రదేశ్తో పోల్చితే, తెలంగాణలో కొత్త కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నేడు నమోదైన కొత్త కోవిడ్ కేసుల సంఖ్య 900పైనే నమోదయ్యింది. మొత్తంగా 923 కొత్త కేసులు నమోదు కాగా, రేపో మాపో రోజువారీ కేసుల సంఖ్య వెయ్యి మార్కు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
బోనాల ఫలితమేనా..?
తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. నెల రోజుల పాటు జరిగిన బోనాల సంబరాలు.. భారీ జనం ఒకే చోట గుమికూడటానికి కారణమయ్యాయి. ఈ క్రమంలోనే కోవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరిగిందన్న భావన వ్యక్తమవుతోంది.
ఫేస్ మాస్కులు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం చెబుతున్నా, జనం మాస్కుల జోలికి పోవడంలేదు. దాంతో, కోవిడ్ వేగంగా విస్తరిస్తోందన్న వాదన లేకపోలేదు. దాదాపుగా తెలంగాణలో అందరూ కోవిడ్ రెండు డోసులు తీసుకున్నా, మూడో డోస్ కూడా అందుబాటులో వున్నా.. ఎందుకిలా కేసులు నమోదవుతున్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.