Telangana : సీఎం, గవర్నర్ వివాదం.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన?
NQ Staff - January 26, 2023 / 11:22 PM IST

Telangana : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు గవర్నర్ తమిళి సై ల మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. బీజేపీ గవర్నర్ అంటూ బీఆర్‌ఎస్ నాయకులు ఆమెపై విమర్శలు చేస్తూ ఉంటే గవర్నర్ మాత్రం తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని.. రాజ్యాంగం రాష్ట్రంలో అమలు కావడం లేదంటూ విమర్శించింది.
తన వద్ద ఇప్పటికే పలు బిల్లులను పెండింగ్ లో ఉంచిన గవర్నర్ తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా మరింతగా ప్రభుత్వంపై గళం ఎత్తారు. బీఆర్‌ఎస్ నేతలను తీవ్ర స్థాయిలో విమర్శించడంతో పాటు ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
హైకోర్టు రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసినా కూడా కరోనా కారణం చెప్పి పెద్ద ఎత్తున రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించలేదు అంటూ గవర్నర్ ఆరోపించారు. పుదుచ్చేరి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న తమిళి సై మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించేందుకు కరోనా అడ్డు చెప్పిన కేసీఆర్ ఖమ్మంలో అయిదు లక్షల మందితో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేసినట్లుగా కేంద్ర హోం శాఖకు తెలియజేసినట్లుగా తమిళిసై అన్నారు.
రాష్ట్రంలో రాజ్యంగా అమలు కాని పక్షంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అన్నట్లుగా కొందరు అనుమానలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయం అంత దూరం వస్తాయా అంటే చెప్పలేం.. ఏం జరగబోతుందో అంటూ రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంఉటన్నారు.