శ్మ‌శానంలో ఆన్‌లైన్ క్లాసులు.. ఎంసెట్‌లో 698 ర్యాంక్ సాధించిన క‌ల్ప‌న‌

క‌రోనా ప‌రిస్థితుల‌ని పూర్తిగా మార్చేసింది. మ‌నిషి మ‌నిషిని క‌లుసుకోవాలంటే భ‌యాన‌కంగా మారిన ఈ ప‌రిస్థితుల‌లో చ‌దువులు ఆన్‌లైన్‌లోనే, బిజినెస్‌లు ఆన్‌లైన్‌లోనే,ట్రీట్‌మెంట్ ఆన్‌లైన్‌లోనే సాగుతుంది.అయితే సిటీల‌లో ఉండే వారికి, డ‌బ్బులు ఉన్న వారికి ఆన్‌లైన్ క్లాసుల వ‌ల‌న పెద్ద ఇబ్బంది ఉండ‌దు. కాని మారుమూల గ్రామాల‌లో సిగ్న‌ల్స్ లేని ఏరియాలో ఉన్న వారి ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది.

Online classes

సిగ్న‌ల్స్ కోసం కొంద‌రు కొండలెక్కుతుంటే, మ‌రి కొంద‌రు అడ‌వుల‌లోకి వెళుతున్నారు మిర్యాల క‌ల్ప‌న వంటి వారు శ్మ‌శానంలోకి వెళ్లి చ‌దువుకుంటున్నారు. గతంలో కర్ణాటకలోని ఓ గ్రామంలో సిగ్నల్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు కొండప్రాంతానికి వెళ్లి ఆన్‌లైన్‌ కాసులకు హాజరవుతున్న ఫోటోలు గత నెలలో వైరల్ గా మారాయి.

జగిత్యాల జిల్లాలో ల్యాల మండలం సర్వాపూర్‌కు చెందిన మిర్యాల కల్పన స్వగ్రామంలో సిగ్నల్స్ లేకపోవడంతో సమీపంలోని శ్మశానవాటికకు వచ్చి ఆన్‌లైన్‌ క్లాసులు వింటుంది . కల్పన 2017 లో ఎంసెట్‌లో 698 ర్యాంకు సాధించింది. ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో చేరింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతోంది. సిగ్న‌ల్స్ స‌మ‌స్య ఉండ‌డంతో ఓ వైద్య విద్యార్థిని ఏకంగా శ్మశానంలో చదువుకుంటూ.. సమాధుల మధ్య ఆన్‌లైన్ క్లాసులు వినింది.

ఇదే విషయంపై కల్పన స్పందిస్తూ.. తనకు కుటుంబసభ్యుల సహకారం ఇస్తున్నారని..అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆన్ లైన్ క్లాసుల కోసం ఇబ్బంది పడుతున్న తనలాంటి వారి కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని.. సిగ్నల్స్ వచ్చే చేయాలని కోరుతుంది.