Telangana : అసెంబ్లీ టికెట్ కోసం సీఎం కాళ్లు… బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు
NQ Staff - November 16, 2022 / 08:45 AM IST

Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ హాజరు అయిన కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఆ సందర్భంగా సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం వివాదాస్పదం అయ్యింది. ఒక ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి సీఎం కేసీఆర్ కి ఇలా కాళ్లు మొక్కడం ఏంటంటూ విమర్శలు చేస్తున్న వారు ఉన్నారు.
మాజీ బ్యూరోక్రట్స్ పలువురు డాక్టర్ శ్రీనివాస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికారుల పరువు తీసినట్లుగా డాక్టర్ శ్రీనివాస్ వ్యవహరించారు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం తో పాటు ఇలాంటి పనుల వల్ల పరువు పోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మాజీ ఐఏఎస్ అధికారి మురళి అకునూరి ట్విట్టర్ లో స్పందిస్తూ… కొత్తగూడెం అసెంబ్లీ TRSటికెట్ గురించే కదా Dr శ్రీనివాస్ CM కాళ్ళు పట్టుకోడం. మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూసా టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే.పదవి misuse చేస్తూ కొత్తగూడెం లో ఎదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నారు అంటూ ట్వీట్ చేశారు.
టీఆర్‌ఎస్ పార్టీకి చేరువ అవుతున్న డాక్టర్ శ్రీనివాస్ కు అసెంబ్లీ సీటు పై కన్ను పడిందని.. అందుకే ఈ పనులు చేస్తున్నారు అంటూ మురళి అకునూరి చేసిన వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నారు. ఆయన నిజంగానే అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.
కొత్తగూడెం అసెంబ్లీ TRSటికెట్ గురించే కదా Dr శ్రీనివాస్ CM కాళ్ళు పట్టుకోడం. మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూసా టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే.పదవి misuse చేస్తూ కొత్తగూడెం లో ఎదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నారు.వీడియో👇 pic.twitter.com/VmX8DZYc5C
— Murali Akunuri (@Murali_IASretd) November 16, 2022