serilingampally assembly constituency is very important in greater war
హోరా హోరీగా సాగిన జీహెచ్ఎంసీ ఎన్నికల పక్రియ ముగిసింది. ఒక్క ఓల్డ్ మలక్ పేట డివిజన్ మినహా మొత్తం అన్ని చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడ బ్యాలెట్ పత్రాల్లో ప్రిట్టింగ్ మిస్టేక్ ఉండటం వల్ల ఎన్నికను రద్దు చేసి ఎల్లుండి నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక గ్రేటర్ ఎన్నికల సమయంలో అందరి దృష్టి కూడా శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పై ఉంది. ఇక్కడ పైకి చూడ ఎంతగా అభివృద్ది ఉంటుందో అంతకు రెట్టించిన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. కేబుల్ బ్రిడ్జీ.. భారీ భవనాలు.. పదుల కొద్ది మల్టీప్లెక్స్ లు.. స్టోర్స్.. కళ్తు తిరిగే ప్లై ఓవర్లు చాలా ఉన్నాయి. వీటన్నింటిని అభివృద్ది అంటూ చూపించి ఎన్నికల్లో ఓట్లు అడిగింది టీఆర్ఎస్ పార్టీ. కాని ఇతర పార్టీలు మాత్రం అదే నియోజక వర్గంలో ఉన్న సమస్యలను ఏకరువు పెట్టింది.
serilingampally assembly constituency is very important in greater war
పైకి చూడగా అంతా అభివృద్ది ఉన్నా కూడా 70 శాతం మంది స్లమ్ ల్లో నివశిస్తున్నారు. వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి విషయంలో ఎలాంటి పట్టింపు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించింది. మొన్నటి వర్షాల కారణంగా ఈ నియోజక వర్గంలోని పలు డివిజన్లలో భారీగా వరదలు వచ్చి జనాలు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. ఈ ఎన్నికల్లో వారు ఎవరికి మద్దతుగా నిలిచారు అనేది ఆసక్తిగా మారింది. శేరిలింగంపల్లి నియోజక వర్గంలో మొత్తం ఏడు డివిజన్లు ఉన్నాయి. ఈ ఏడు డివిజన్లు కూడా టీఆర్ఎస్ గెలుచుకోవాల్సి ఉంది.
సెంచరీ కొడతాం అంటూ కేటీఆర్ చేసిన ప్రకటన సాధ్యం అవ్వాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఏడు డివిజన్లకు అయిదు ఆరు అయినా గెలవాల్సి ఉంది. అక్కడ ఉన్న ఓటర్లను ఆకర్షించేందుకు టీఆర్ఎస్ బాగానే ప్రయత్నించింది. మరి వారు ఎటు ఓటు వేశారు అనేది బ్యాలెట్ బ్యాక్స్ ఓపెన్ చేస్తే కాని తెలియదు. జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఫలితాల తలరాత మర్చే సత్తా ఈ నియోజక వర్గ ప్రజలకు ఉంది అంటూ బీజేపీ చాలా బలంగా ప్రచారం చేసింది. టీఆర్ఎస్ కు ప్రభుత్వ హయాంలో వచ్చిన హంగులకు ఓట్లు దక్కాయా లేదంటే స్లమ్ ఏరియాల్లో ఉన్న వారు సమస్యల వల్ల వేరే పార్టీకి ఓటు వేశారా అనేది తేలాల్సి ఉంది.
We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.AcceptPrivacy policy