Telangana Movement : తెలంగాణ విమోచనా.? విద్రోహమా.? విలీనమా.?

NQ Staff - September 3, 2022 / 09:51 PM IST

Telangana Movement :   తెలంగాణ విమోచనా.? విద్రోహమా.? విలీనమా.?

Telangana Movement : భారతదేశంలో తెలంగాణ ప్రాంతం విలీనమయ్యింది దాదాపు డెబ్భయ్ ఏళ్ళ క్రితం. తెలంగాణకు భారత ప్రభుత్వం ద్వారా నిజాం ప్రభుత్వం నుంచి విమోచన లభించింది.! దీన్ని కొందరు విద్రోహం అని కూడా అంటుంటారు. ఇందులో ఏది నిజం.? అంటే, ఆయా వ్యక్తులు లేదా పార్టీల ఆలోచన విధానాల్ని బట్టి వుంటుందనుకోండి.. అది వేరే సంగతి.

తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్ 17వ తేదీకి చాలా ప్రాధాన్యత వుండేది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, సెప్టెంబర్ 17వ తేదీని సరిగ్గా పట్టించుకునేవారే లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో బీజేపీ కీలకమైన ముందడుగు వేసింది. కేంద్రమే విమోచన దినోత్సవాన్ని నిర్వహించేలా బీజేపీ నేతలు, తమ అధిష్టానాన్ని ఒప్పించగలిగారు.

ఈ ఏడాది నుంచే విమోచన దినోత్సవం..

September 17th Was Very Important in Telangana Movement

September 17th Was Very Important in Telangana Movement

వచ్చే ఏడాదితో 75 ఏళ్ళవుతుంది తెలంగాణకు విమోచన కలిగి. అందుకే, ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అధికారిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వీటిని వజ్రోత్సవ సంబరాలుగా నిర్వహిస్తారట. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఏడాది జరిగే విమోచనోత్సవాలకు హాజరవుతారట.

మరి, తెలంగాణ సర్కారు ఏం చేయబోతోంది.? అబ్బే, ఇది విమోచనం కాదు.. విలీనం.. అంటూ మజ్లిస్ పార్టీకి భయపడి తూతూ మంత్రం ప్రకటన చేస్తుందా.? అన్న చర్చ జరుగుతోంది. ఏదైతేనేం, సెప్టెంబర్ 17వ తేదీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు వుండాలి, వుండి తీరాలి కూడా. వుంటుందా మరి.?

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us