Telangana : సెప్టెంబర్ 17.. ఈ తెలంగాణకి ఏమయ్యింది.?
NQ Staff - September 17, 2022 / 02:48 PM IST

Telangana : స్వతంత్ర భారతావని వజ్రోత్సవాలు ఇటీవల ముగిశాయి. ఏడాది పాటు ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా జరిపింది కేంద్ర ప్రభుత్వం. ఆయా రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాయి. మరి, తెలంగాణ విషయంలో ఏం జరుగుతోంది.? తెలంగాణకి కాస్త లేటుగా స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిష్ పాలకుల నుంచి కాదు, నిజాం పాలకుల నుంచి. సెప్టెంబర్ 17, 1948 తెలంగాణఖు స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు.
చరిత్రని ఒక్కొక్కరూ ఒక్కోలా వక్రీకరిస్తుంటారు. విమోచనం, విలీనం, విద్రోహం, విముక్తి.. ఇలా ఏవేవో పేర్లు ప్రచారంలోకి వస్తుంటాయి. తరచి చూస్తే ఇందులో ప్రతి ఒక్కటీ నిజమే అనిపించకమానవు.
వేలాది చావులకు గౌరవం ఏదీ ఎక్కడ.?

September 17 1948 was day Telangana Gained Independence
త్యాగమంటే అలాంటి లాంటి త్యాగం కాదు.! స్వాతంత్ర్య పోరాటానికి ఏమాత్రం తీసిపోని రీతిలో తెలంగాణ ప్రజలు పోరాడారు, వేలాది మంది రక్తం చిందించారు.. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయ్. మరి, ఆ చావులకు గౌరవం వుండాలి కదా.? వుండాలంటే ఏం చేయాలి.?
తెలంగాణకు సెప్టెంబర్ 17న స్వాంత్ర్యం వచ్చిందా.? బలవంతంగా భారత ప్రభుత్వం తెలంగాణను లాక్కుందా.? నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలెందుకు తిరగబడ్డారు.? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు.? డెబ్భయ్ నాలుగేళ్ళ తర్వాత అధికారికంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయంటే.. ఇన్నాళ్ళూ ఎందుకు చరిత్రను పాతాళంలోకి తొక్కేసినట్లు.?