Viral News : ఒకే ముహూర్తానికి ఇద్దరమ్మాయిలతో పెండ్లి.. ఆడు మగాడ్రా బుజ్జి..!
NQ Staff - March 9, 2023 / 09:24 AM IST

Viral News : ఇప్పటి వరకు మనం ఎన్నో వింత వివాహాలు చూశాం. ఒకే ముహూర్తానికి ఇద్దరు అక్కాచెల్లెల్లను పెండ్లి చేసుకున్న యువకులను చూశాం. అక్కను చేసుకోబోయి చెల్లెను పెండ్లి చేసుకున్న యువకులను కూడా చూశాం. కానీ ఇప్పుడు అంతకు మించిన విచిత్రమైన పెండ్లి వేడుక జరుగబోతోంది. అది కూడా భ్రదాచలంలోనే.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన సత్తిబాబు అనే యువకుడు తాను చదువకునే కాలేజీలో ఇద్దరు స్నేహితురాళ్లను ప్రేమించాడు. ఇదే మండలంలోని దోసిళ్లపల్లి గ్రామానికి చెందిన స్వప్న కుమారి, కుర్రపల్లి గ్రామానికి చెందిన సునీతలతో సహజీవనం చేశాడు.
మూడు కుటుంబాల సమక్షంలోనే..
ఇద్దరితో ఇద్దరు పిల్లలను కూడా కన్నాడు. ఇప్పుడు ఇద్దరి అంగీకారంతో ఇద్దరినీ పెండ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. విచిత్రం ఏంటంటే ఈ వివాహానికి పెద్దలు కూడా ఒప్పుకున్నారు. మూడు కుటుంబాల సమక్షంలోనే ఈరోజు ఇద్దరినీ ఒకే ముహూర్తంలో వివాహం చేసుకోబోతున్నాడు.
అది కూడా యువకుడి గ్రామంలోనే పెండ్లి చేసుకోబోతున్నాడు. ఇందుకు సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ విషయం తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదేం విచిత్రం రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో ఆడు మగాడ్రా బుజ్జి అంటూ కామెంట్లు చేస్తున్నారు.