Saidabad Case Accused Raju: వ‌రంగ‌ల్‌లో ముగిసిన రాజు అంత్య‌క్రియ‌లు..

Saidabad Case Accused Raju: సింగరేణి చిన్నారి ఘటనలో నిందితుడైన రాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాజు మృతదేహానికి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అంత్యక్రియల నిర్వహణపై కుటుంబసభ్యులతో చర్చించారు రైల్వే పోలీసులు. ఆపై వరంగల్‌లోని పోతన స్మశాన వాటికలలోనే రాజు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబసభ్యులు

Saidabad Case Accused Raju Final Rites Completed
Saidabad Case Accused Raju Final Rites Completed

రాజు మృతదేహం ఉన్న అంబులెన్సు మార్చురీ వద్దకు చేరుకుంటుండగా, కొందరు స్థానికులు ఆవేశంతో చెప్పులు విసిరారు. చిన్నారిని అమానుషంగా పొట్టనపెట్టుకున్న కిరాతకుడికి తగిన శిక్షే పడిందని శాపనార్థాలు పెట్టారు. అయితే వారిని సాయుధ పోలీసులు అడ్డుకొని శాంతపరిచారు. ఈ సందర్భంగా రాజు మృతదేహాన్ని భారీపోలీసు బందోబస్తు మధ్య మార్చురీ గదికి తరలించారు.

రాజు ఆత్మ‌హ‌త్య ఎందుకు చేసుకున్నాడు అనే దానిపై కార‌ణాలు తెలియాల్సి ఉంది. రాజు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ముందు రైల్వే కీమెన్లు రాజును ఆపేందుకు ప్రయత్నించారు. అతను ట్రాక్‌పై నడుస్తున్న సమయంలో చూశామని.. కానీ రాజు తమను చూసి పొదల్లోకి వెళ్లి దాక్కున్నాడని రైల్వే కీమెన్లు పేర్కొన్నారు. మేం ఉన్నంత సేపు రాజుముళ్ల పొద‌ల నుండి బ‌య‌ట‌కు రాలేదు.దాంతో మేము మా ప‌నుల‌కు వెళ్లిపోయాం అని కీమెన్లు చెప్పారు.

రైలుకు ఎదురుగా వెళుతున్న రాముని ఆపేందుకు మేము అరిసాం అని అక్క‌డ ఉన్న రైతులు చెప్పారు. మేం అత‌నికి కొంత దూరంలో ఉండ‌గానే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్‌కి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారని రైతులు పేర్కొన్నారు. రాజు వద్ద రెండు జియో సెల్‌ఫోన్లు, ఇంటి తాళం చెవి, పది రూపాయలు దొరికాయన్నారు. మొహం అంతా చిద్రంగా మార‌డంతో అత‌ని చేతుల‌పై ఉన్న టాటూతోనే అత‌ను రాజుగా గుర్తించారు పోలీసులు.