Saidabad Case: సైదాబాద్ కిల్ల‌ర్ ఆచూకీ చెబితే 10 ల‌క్ష‌ల న‌జ‌రానా

Saidabad Case: హైదరాబాద్ లోని సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన రాజు అనే వ్య‌క్తి కోసం పోలీసులు తెగ గాలిస్తున్నారు. చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి గదిలోకి తీసుకెళ్లిన రాజు…. హత్యాచారం చేశాడు. చిన్నారి మృతదేహాన్ని పరువులో చుట్టి నిర్మానుష ప్రాంతంలో పడేద్దామని నిందితుడు భావించినప్పటికీ… వీలుకాకపోవడంతో మృతదేహాన్ని గదిలో పెట్టి తాళం వేసి వెళ్లాడు.

Saidabad Case Accused Police Announced 10 Lakhs Reward
Saidabad Case Accused Police Announced 10 Lakhs Reward

చిన్నారిపై దురాఘతానికి పాల్పడ్డాడన్న ఆలోచన ప్ర‌తి ఒక్క‌రిని ఆగ్ర‌హానికి గుర‌య్యేలా చేస్తుంది. వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది. “ఆ మానవమృగాన్ని మాకు అప్పగిస్తారా…? మీరే ఎన్​కౌంటర్​ చేస్తారా..?” అంటూ కోపంతో ఊగిపోయారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

చిన్నారిని అత్యాచారం చేసి ఆపై గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. చిన్నారి ఇంటి పక్కన గదిలో నివాసం ఉండే రాజు ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. సొంత గ్రామానికి తీసుకెళ్లి అశ్రునయనాల మధ్య చిన్నారి అంత్యక్రియలు నిర్వహించారు.

పరారీలో ఉన్న నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడి కోసం సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. రాజు కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజు గురించిన వివరాలపై కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు. అయితే ఐదు రోజులుగా రాజు ఆచూకీ తెలియ‌క‌పోవ‌డంతో పోలీసులు ప‌ట్టించిన వారికి ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల న‌జ‌రానా ప్ర‌క‌టించారు.

Saidabad Case Accused Police Announced 10 Lakhs Reward
Saidabad Case Accused Police Announced 10 Lakhs Reward

నిందితుడి ఆచూకీ తెలిసిన వారు 94906 16366 అనే నెంబ‌ర్‌కు కాల్ చేయాలని అన్నారు. ఈ మ‌ధ్య కాలంలో తెలంగాణ పోలీసులు ఇంత భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన దాఖ‌లాలు లేవు. ప‌ది బృందాలుగా విడిపోయి రాజు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్న‌ప్ప‌టికీ అత‌డి ఆచూకీ దొర‌క‌డం లేదు.

నిందితుడు రాజు ఆనవాళ్లను విడుదల చేశారు సీపీ అంజనీకుమార్‌. రాజు రెండు చేతులపై మౌనిక అనే టాటూ ఉందని.. వయస్సు సుమారు 30 ఏళ్లుగా ఉంటుందని చెప్పారు. రాజు ఎత్తు 5.9 అడుగులుగా ఉంటుందని.. పెద్ద జుట్టుకు రబ్బర్‌ బ్యాండ్‌ వేసుకొని తిరుగుతాడని వెల్లడించారు.

సైదాబాద్‌ నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి డబ్బులు ఇవ్వడం తో పాటు… వారి వివరాలను చాలా గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. సుదీర్ఘ చర్చల అనంతరం తాము రివార్డు ప్రకటిస్తున్నామన్నారు.